నిర్మాతకి ఒక భారీ సక్సస్ వస్తే ఇక ఆపడం కష్టమే. ఒక్క హిట్ సినిమా తో వచ్చిన డబ్బుతో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడే పెద్ద సమస్య వస్తోంది. న్యూట్రల్ గా వెళ్ళే నిర్మాతలు చాలా తక్కువ. అదే సమయంలో సరైన జడ్జిమెంట్ కూడా ఉండకపోవడంతో మొత్తం తలకిందులై పోతుంది. ఒక్కసారిగా భారీ ఫ్లాప్ వస్తే తట్టుకోలేరు. అలాంటిది వరుస ఫ్లాపులోస్తే ఇక సినిమాలకు ఫులిస్టాప్ పెట్టక తప్పదు అనే ఆలోచనకి ఎంత పెద్ద నిర్మాతకైనా రావడం కామన్. అయితే నిర్మాత అనిల్ సుంకర మాత్రం ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోకుండా సినిమాలు నిర్మిస్తునే ఉన్నాడు. ఇటివలే ఈయన నిర్మించిన 'రాజు గాడు' - 'కిరాక్ పార్టీ' -'సీత' సినిమాలు భారీ నష్టాలను తెచ్చాయి.

అయినా కూడా ధైర్యం చేసి గోపిచంద్ తో 'చాణక్య' నిర్మించాడు. ఇప్పుడు ఈయన ఫ్లాపు లిస్టులోకి ఈ 'చాణక్య' కూడా చేరిపోయింది. ఎంతో నమ్మకం పెట్టుకొని మంచి బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఓపినింగ్స్ కూడా పెద్దగా రాలేదు. మొదటి షోకే ఫ్లాప్ అనే టాక్ రావడం తో రిలీజ్ రోజు నుండే సినిమా డౌన్ అయింది. ఈ సినిమా కంటే ముందు గోపీచంద్ కి వరుస ఫ్లాపులు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్దగా జరగలేదు. శాటిలైట్ రైట్స్ కి కూడా ఆశించినంత రాలేదని తాజా సమాచారం.

ఇక ఇలా వరుసాపజయాలు అందుకుంటూ సినిమాలను నిర్మిస్తున్న ఈ నిర్మాతకి ఇక ఇప్పుడు కనపడుతున్న ఒకే ఒక్క ఆశ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాతో మళ్ళీ భారీ కలెక్షన్స్ అందుకొని సక్సెస్ ఫుల్ నిర్మాత అనిపించుకోవాలని చూస్తున్నాడు. మరి మహేష్ సినిమాతో అయినా అనిల్ సుంకర నిర్మాతగా సక్సెస్ కొడతాడా లేదా చూడాలి. అయితే ఈ సినిమాకి మరో నిర్మాత దిల్ రాజు తో పాటు మహేష్ కూడా భాగస్వామి అని తెలిసిన విషయమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: