అప్పట్లో కృష్ణ వంశి దర్శకత్వంలో రవితేజ,శ్రీకాంత్,ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఖడ్గం’ మూవీలో సంగీత పాత్ర అందరి హృదయాలు కదిలించేలా చిత్రీకరించారు.  సినిమాలపై మోజుతో పట్నం వచ్చిన ఓ అమ్మాయిని కొంత మంది దళారులు ఎలా మోసం చేశారు అన్నది..హీరో రవితేజ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో నిరూపించుకుంటా అంటూ ఎంతోమంది నిర్మాతలను ప్రాధేయపడటం నిజంగా కన్నీరు పెట్టించేలా ఉంటుంది.  ఇది సినిమా..కానీ నిజ జీవితంలో ఎంతో మంది కళాకారులు స్టూడియోల వెంట తిరుగుతూనే ఉంటారు. 

ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్ అంటూ పగలూ, రాత్రి అనే తేడా లేకుండా స్టూడియో ముందు పడిగాపులు కాస్తుంటారు.  అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది పాయల్ రాజ్ పూత్.  ప్రస్తుతం ఈ అమ్మడు  ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ మూవీలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా..తాను సినిమాల్లోకి ఎలా వచ్చింది..ఎన్ని కష్టాలు పడిందీ అన్న విషయం గురించి చెప్పింది. నా కాలేజ్ అయ్యాక మొదట సీరియల్స్ లో నటించాను. నేను ఇప్పటి వరకు మూడు సీరియల్స్ లో నటించాను. ఆరేళ్లు ముంబాయిలోనే ఉంటూ సీరియల్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూశాను.

తెలుగు, తమిళం ఇతర భాషల్లో నటించేందుకు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను..కానీ చాలా మంది రిప్లై ఇవ్వలేదు..కొంత మంది ముఖంపైనే బాగలేదు వెళ్లిపొమ్మని చెప్పారు. అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని..అయినా ప్రయత్నం మాత్రం చేస్తూ వచ్చాను. సినిమాల్లో స్టార్ డమ్ ఒక్క రాత్రికే రాదు..ఆరేళ్లు ఈ ఛాన్స్ కోసం కష్టపడ్డాను అన్నారు పాయల్ రాజ్ పూత్.  ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా షూట్‌ సమయంలోనూ మా అమ్మ నా పక్కనే ఉన్నారు. నేను కెమెరా ముందు రొమాంటిక్‌ సీన్లు చేస్తుంటూ ఆమె అసౌకర్యంగా ఫీల్‌ అయ్యారు.  కాని ఫలితం చూశాక అందరం సంతోషించాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: