మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాయలసీమలోని రెండు ప్రాంతానికి చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రారంభం నాటి నుండి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా ఫీల్ తో ఈ సినిమా తెరకెక్కడంతో, తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ కొడుతుంది అని అందరూ భావించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా, 

కేవలం ఒక యావరేజ్ సినిమాగా నిలిచి, ప్రస్తుతం చాలా చోట్ల కేవలం పర్వాలేదనిపించేలా మాత్రమే కలెక్షన్స్ ని సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఎమోషన్స్ కు పెద్ద పీట వేసిన ఈ సినిమాలో, కొన్ని సన్నివేశాలు పేలవంగా ఉండడం, అలానే భారీ రన్ టైం వంటివి సినిమాకు కొంత నష్టం చేకూర్చాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో భారీ డ్రాప్స్ ని చవిచూస్తోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే నైజాం ప్రాంతంలో మాత్రం కొంతవరకు బెటర్ గా పెర్ఫర్మ్ చేస్తున్న ఈ సినిమా, ఓవర్సీస్ లో బాగానే నష్టాలను మిగిల్చనుందట. 

ఇక అందుతున్న సమాచారం ప్రకారం, ఓవర్ ఆల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలంటే మరొక ఎనభై కోట్లకు పైగా రాబట్టాలని తెలుస్తోంది. అలానే మరొకవైపు నార్త్ లో కూడా వార్ మరియు జోకర్ సినిమాల మధ్య సైరాకు చాలానే నష్టం జరిగిందని, అక్కడ కూడా ఈ సినిమా చాలా పూర్ గా నడుస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సైరా అంత భారీ మొత్తాన్ని రాబట్టడం అసాధ్యమని, మొత్తంగా ఈ సినిమా పెద్ద సంకట స్థితిలో పడ్డట్లే అని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో సైరా ఎంతమేర కలెక్స్ చేస్తుందో, బయ్యర్లను ఎంత మేర సేవ్ చేస్తుందో చూడాలి....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: