టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి నేటితో తన 45వ ఏట ప్రవేశిండం జరిగింది. ఇక ఈ పుట్టినరోజు సమయంలో విదేశాల్లో ఉన్న రాజమౌళి, తన బర్త్ డే  సందర్భంగా విష్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెల్పుతూ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, 

మరియు కొమరం భీంలు తమ యుక్త వయసులో కుటుంబాలను వదిలి బయటకు వచ్చిన తరువాత ఏ విధంగా తమ జీవితాన్ని గడిపారు అనే దానిపై కొంత కల్పిత కథగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరిగా నటిస్తుంటే, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే దీని తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. కొందరేమో మళ్ళి ప్రభాస్ తోనే చేస్తారు అంటుంటే మరికొందరు హృతిక్ రోషన్ తో అని, ఇంకొందరు మహేష్ బాబుతో అని, ఇలా పలు రకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

రాజమౌళి తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ తోనే ఉండబోతున్నట్లు సమాచారం, నిజానికి ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితమే ఈ కాంబినేషన్ సెట్ అయిందని, వారి సినిమాకు దుర్గ ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ గారు నిర్మాతగా వ్యవహరిస్తారని అంటున్నారు. ఇక మరింత ఆలస్యం చేయకుండా తన నెక్స్ట్ సినిమాని నారాయణ గారు, మహేష్ గారి కాంబినేషన్లో చేసేందుకు రాజమౌళి సిద్దమవుతున్నారట. అయితే ఆ సినిమా ఎలా ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. నేడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మహేష్ ఫ్యాన్స్ కు ఇది అతి పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: