అందముంటే చూపించాలి. లేకపోతే అందం ఎందుకు. కనీసం అద్దమైనా చూడని అందం ఎందుకు. ఇది మంచి లాజిక్కే మరి. ఎందుకంటే ఎంత అందం ఉన్నా చూపించేది అద్దమే కదా. అంటే అందాన్ని ముందు చూసేది అద్దమే. సో అద్దమే సొగసుగత్తెలకు అసలైన బాయ్ ఫ్రెండ్ అన్న మాట. అందం విరగబూసి ఉన్నా ప్రయోజనం ఏంటి. కూర వండుకు తింటారా. చూసే కనులుంటేనే వాటికి పుణ్యం. పుట్టినందుకు ధన్యం.


ఈ సీక్రెట్ అందరికీ తెలియదు కదా అందుకే అందాలను ఆదా చేస్తూంటారు. కానీ టాలీవుడ్ గ్లామర్ ఫిగర్ ఆదాశర్మకు అందం విలువ తెలుసు. అందుకే ఆదా పేరులోనే తప్ప నేను ఎక్కడా ఆదా చేయను అంటూ అందాల ఆరబోతను ఫ్రీగా చేసేస్తోంది. చూసిన కళ్ళకు చూసినంత ఆనందం అంటోంది. హార్ట్ అటాక్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తరువా సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం వంటి హిట్ మూవీస్ లో చేసినా కూడా బ్రేక్ రాలేదు. మరెందుకు అన్నట్లుగా తన అందాల ప్రదర్శనకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చిపోతోంది.


 బికినీ అందాలతో ఆదా చేసిన మ్యాజిక్ ఒక ఎత్తు అయితే ఇపుడు కన్నుల విందుగా అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలు పెట్టింది.  వీటికి లక్షల్లో లైక్స్ వస్తున్నాయట. ఈ విధంగానైనా హిట్ అయ్యానని సంబరపడుతున్న ఆదా శర్మకు టాలీవుడ్ నుంచి మాత్రం ఇప్పటికీ  పిలుపు రావడంలేదుట. మరి ఆదా అందాల‌కు వెండి తెర మేలుకొలుపులు లేవా అని సోషల్ మీడియా కుర్రోళ్ళు తెగ ఫీల్ అవుతున్నారట. చూడాలి ఈ అమ్మడి దశ తిరుగుతుందో లేదో. కానీ ఆదా శర్మ మాత్రం పట్టువదలకుండా ఇన్స్ట్రాగ్రాంలో తన హాట్ హాట్ పిక్ లను ఎప్పటికపుడు వండి వారుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: