బిగ్ బాస్ సీజన్ 3లో క్రేజీ కపుల్స్ గా ఉన్న రాహుల్, పునర్నవిల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఏకంగా హోస్ట్ గా ఉన్న నాగార్జుననే వారిద్దరి మధ్య రిలేషన్ ను కన్ఫాం చేశాడు. అయితే హౌజ్ లో ఉన్నంత సేపు రాహుల్, పునర్నవి చాలా క్లోజ్ గా ఉండగా బయటకు వచ్చాక పునర్నవి తన మాట మార్చేసింది.  


బిగ్ బాస్ హౌజ్ లో తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని.. ఒకవేళ బయటకు వచ్చాక రాహుల్ తనకు ప్రపోజ్ చేస్తే మనకిది అవసరమా అని అడుగుతానని అంటుంది పునర్నవి. అంతేకాదు రాహుల్ ప్రపోజ్ చేస్తే కచ్చితంగా రిజెక్ట్ చేస్తానని.. కేవలం తామిద్దరం ఫ్రెండ్స్ గా మాత్రమే ఉండాలని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది పునర్నవి.     


ఇంట్లో ఉన్నంతసేపు రాహుల్ మీద ప్రేమాభినామాలు చూపించిన పునర్నవి ఇలా సడెన్ గా ప్లేట్ మార్చడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఇంట్లో పేరెంట్స్ చెప్పడం వల్ల పునర్నవి తన ఆలోచన మార్చుకుని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు హీరోయిన్ గా తనకు మంచి ఫ్యూచర్ ఉందన్న ఆలోచనతో కూడా ప్రేమా గీమా అనే విషయాల పట్ల ఆలోచించ వద్దని చెప్పినట్టు ఉంటారని అంటున్నారు.    


అయితే ఎవరేం చెప్పినా సరే మనసు మన మాట వినదు కదా అని కొందరు అంటున్నారు. ఒకవేళ పునర్నవి రాహుల్ నిజంగానే బయటకు వచ్చాక కూడా మంచి స్నేహితులుగా ఉన్నా కచ్చితంగా వారు ప్రేమలో పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ ఇప్పటివరకు 2 సీజన్లు కంప్లీట్ చేసుకోగా 3వ సీజన్ లో కరెక్ట్ గా క్రేజీ లవ్ కపుల్స్ తయారయ్యారు. మరి వీరి నిజంగానే లవ్ బర్డ్స్ గా మారుతారా లేక ఫ్రెండ్స్ గా ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: