తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ఎవరు అనగానే మరో మాట లేకుండా చెప్పే పేరు అంటే అది రాజమౌళి మాత్రమే. బాహుబలి సినిమాతో రాజమౌళి సృష్టించిన రికార్డులు అన్ని ఇన్నీ కావు. స్టూడెంట్ నంబర్ 1తో కెరియర్ స్టార్ట్ చేసిన రాజమౌళి బాహుబలి వరకు తీసిన 11 సినిమాల్లో ఒకదానికి మించి మరొకటి సక్సెస్ అందుకున్నాడు.


ప్రతి దర్శకుడు తీసేది రెండున్నర గంటల సినిమానే కాని అది సక్సెస్ అయ్యేలా చేయడంలోనే ఉంది ఆ దర్శకుడి యొక్క గొప్పతనం. అయితే టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత తీసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ వస్తున్నాడు కొరటాల శివ. రైటర్ నుండి డైరక్టర్ గా మారిన కొరటాల శివ దర్శకుడిగా మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు.


ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించి చరణ్ రోల్ పై ఆడియెన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడింది. చిరు 152లో చరణ్ కూడా ఉన్నాడని.. చిరు యంగ్ ఏజ్ రోల్ లో చరణ్ కనిపిస్తాడని రకరకాల వార్తలు వచ్చాయి.  


అయితే కొరటాల శివ కూడా రాజమౌళి లానే సినిమా మీద వచ్చిన వార్తలన్నిటికి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ ఇస్తాడట. రాజమౌళి తన ప్రతి సినిమాకు ఇదే పంథా కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫాలో అవుతున్నాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల శివ చిరు సినిమాతో కూడా సోషల్ మెసేజ్ ఇస్తున్నాడట. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ ప్రెస్ మీట్ లో చెబుతాడని తెలుస్తుంది. మరి ఆ ప్రెస్ మీట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: