ఒక్క సినిమా కూడా చేయకుండా ఓ చిన్నపాటి హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే అది మాములు విషయం కాదు. కేవలం తన సోయగాలతో ఆడియెన్స్ ను వల్లో వేసుకునే భామలు చాలామంది ఉంటారు. వారిలో ఢిల్లీ భామ కెతిక శర్మ ఒకరు. తన క్రేజీ ఫోటో షూట్స్ తో అటు ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఇలా అన్ని సామాజిక మాధ్యమాలతో చెలరేగిపోతుంది ఈ అమ్మడు.


తను చేసే ఈ గ్లామర్ షో చూసి తెలుగు సినిమా అవకాశం వచ్చింది. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా వస్తున్న రొమాంటిక్ మూవీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కెతిక శర్మ. నూతన దర్శకుడు అనీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కెతిక శర్మ అదరగొట్టడం ఖాయమని అంటున్నారు.


రీసెంట్ గా రిలీజైన రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ క్రేజీగా మారింది. మొదటి సినిమాలోనే కెతిక గ్లామర్ షో విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని తెలుస్తుంది. చూస్తుంటే అమ్మడికి తెలుగులో బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. రొమాంటిక్ టీజర్ కాస్త రిలీజ్ అయితే మాత్రం ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూలు కట్టేయడం ఖాయం.


ఇన్నాళ్లు తన ఫోటోలతో అలరించిన కెతిక శర్మ ఇక మీదట తన అభినయంతో కూడా అదరగొట్టాలని చూస్తుంది. తప్పకుండా రొమాంటిం సినిమాతో ఆమెకు హిట్టు దక్కేలా ఉంది. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచిన రొమాంటిక్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈమధ్యనే ఇస్మార్ట్ శంకర్ తో హిట్ తో మంచి లభాలు తెచ్చుకున్న డైరక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు సినిమాను మరింత రిచ్ గా తీస్తున్నాడని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: