జర్మనీలో పుట్టి, పెరిగిన ఎవెలిన్‌ ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ కు ప‌రిచ‌య్య‌మ‌య్యింది ఎవెలిన్‌ శర్మ. బాలీవుడ్ సినిమాల్లో న‌టించిన భామ‌లు ఒక్కొక్క‌రు పెళ్లి పీఠ‌లు ఎక్కేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ సినిమాల ద్వారా ప‌రిచ‌యం అయిన మ‌రో భామ సైతం పెళ్లి పీఠ‌లు ఎక్కేస్తోంది. త‌న ప్రియుడిని ఆమె పెళ్లాడ‌నుంది. ఇంత‌కు ఆమె తెలుగులో ఇటీవ‌ల ఓ క్రేజీ సినిమాతో కూడా మ‌న‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆమె ఎవ‌రో కాదు… సాహోలో తన నటనతో ఆకట్టుకున్న జర్మన్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ. ‘సాహో’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఎవెలిన్‌.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్నారు. ఈ బ్యూటీ త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. ఇటీవ‌లె ఆస్ట్రేలియాలో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్‌ సర్జన్‌ తుషన్ బైనాండితో ఆమె కొంతకాలంగాడేటింగ్ చేస్తుంది.


ఇటీవ‌లె విడుద‌లైన సూప‌ర్ హిట్ మూవీ  'సాహో'లో ప్రభాస్ ప‌క్క‌న త‌న అందచందాలతో ఆకట్టుకుంది. సిడ్నీలోని ప్రఖ్యాత హార్బర్‌ బ్రిడ్జి బ్యాక్‌ డ్రాప్‌ లో కాబోయే భర్త తుషన్‌ కు లిప్ కిస్ ఇస్తూ, రొమాంటిక్‌ గా దిగిన ఫొటోను ఆమె అభిమానులతో పంచుకుంది. ఎవెలిన్‌ ఎంగేజ్‌ మెంట్‌ జరిగిందని తెలుసుకున్న పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, జర్మనీలో పుట్టిన ఎవెలిన్, అక్కడే పెరిగింది. 'ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌' ద్వారా బాలీవుడ్‌ కు, ఆపై 'సాహో' ద్వారా తెలుగు తెరకు ఈ ముద్దుగుమ్మ పరిచయమైంది. ఎవెలిన్‌ తన ఎంగేజ్‌మెంట్‌ అయిందని ప్రకటించగానే అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో తనను విష్‌ చేసిన వారందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సాహోలో ప్రభాస్ ప‌క్క‌న ఆమె బ్యాడ్ బాయ్ సాంగ్‌లో జాక్వాలైన్ ఫెర్నాండెజ్‌తో క‌లిసి ఆడిపాడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: