‘కెరటం’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ర‌కుల్‌. ఇలాంటి తరుణంలో రకుల్ ప్రీత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి.. పెళ్లి ఎప్పుడు అనే ముచ్చట్లు చెప్పింది. ఈ మధ్యే మంచు లక్ష్మీ ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ప్రోగ్రామ్‌లో చాలా విషయాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే పెళ్లిపై ఆసక్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది ర‌కుల్. నువ్వు ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నావా అంటూ లక్ష్మీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నీకు తెలియదా అనేసింది రకుల్. పైగా నీకు తెలియని సీక్రేట్స్ ఏముంటాయి అంటూ రెచ్చగొట్టింది రకుల్. నాకు కాదు ప్రేక్షకులకు చెప్పు అనగానే.. నేను సింగిల్ అంటూ బోర్డ్ పట్టుకుని ఉన్నాను.. ప్లీజ్ ఎవరైనా నా లైఫ్‌లోకి రండి అంటూ పిలుస్తుంది రకుల్.


టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తన కెరీర్ లో వివిధ భాషల్లో ఎంతో మంది హీరోల సరసన నటించింది. అయితే ఒక హీరోతో మాత్రం రకుల్ చాలా ఇబ్బంది పడిందట. సదరు హీరోతో లొకేషన్ లో రొమాన్స్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు... అతని నుంచి వచ్చే చెమట కంపును భరించలేకపోయేదాన్నని రకుల్ తెలిపింది. ఆ విషయాన్ని అతనికి చెప్పేందుకు భయమేసి... చివరకు తానే దూరంగా వెళ్లి పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చానని చెప్పింది. తనను చూసి యూనిట్ లోని చాలా మంది కూడా అలాగే చేశారని తెలిపింది. అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: