టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన కన్నడ భామ హరిప్రియ సుపరిచితమే. తెలుగులో తకిట తకిట సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ తరువాత పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, జైసింహ వంటి సినిమాలు చేసింది. కన్నడలో పలు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మరో కన్నడ బ్యూటీ రష్మిక మందనాపై చేసిన వ్యాఖ్యలు అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి.

 


కన్నడలో హరిప్రియ నటించగా ఈ వారం విడుదలవుతున్న ఎల్లిదే ఎల్లికాంత అనే సినిమాలో హీరో స్రుజన్ తో ఓ లిప్ లాక్ సీన్ లో నటించింది. అయితే ఈ లిప్ లాక్ ను గీత గోవిందంలో విజయ్ – రష్మిక లిప్ లాక్ తో పోలుస్తున్నారు. ఇదే విషయమై హరిప్రియను అడిగిన మీడియాకు ఆమె ఘాటైన సమాధానం ఇచ్చింది. ‘గీత గోవిందంలో విజయ్ – రష్మిక మధ్య లిప్ లాక్ జరిగింది, నాకు స్రుజన్ కు మధ్య కిస్ సీన్ మాత్రమే జరిగింది. నా లిమిట్స్ నాకు తెలుసు. కుటుంబంతో వచ్చే ప్రేక్షకులకు ఇబ్బందులు లేకుండా ఈ సీన్ ఉంటుంది. స్క్రిప్ట్ డిమాండ్ వరకే ఆ సీన్ లో నటించాను. సినిమా ఒప్పుకునే ముందే నా పాత్రను చూసుకుంటాను’ అని సమాధానం ఇచ్చింది. దీంతో రష్మికపై ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

 


చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఇటివల విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ లో నటించింది. విజయ్ – రష్మిక కాంబో టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ పెయిర్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య లిప్ లాక్స్ ఉన్నాయి. వీటినుద్దేశించే హరిప్రియ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: