మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ టాలీవుడ్ లో కలెక్షన్లు అదరగొడుతోంది. సినిమాలో చిరంజీవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తొమ్మిదో రోజు కూడా స్పీడ్ ఫుల్స్ రన్ అవుతూ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. భారతదేశ తొలి స్వాతంత్ర సమరయోధుడి కథను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శక, నిర్మాత సక్సెస్ అయ్యారు. కర్ణాటకలో కూడా సైరా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేసిన ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది.

 


భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడి వీరగాధగా తెరకెక్కిన ఈ సినిమాను ఆర్మీ కోసం ప్రత్యేక ప్రదర్శన వేయనుంది. బెంగళూరు సిటీలో సైరాను 60 స్క్రీన్స్ లో ప్రదర్శించబోతోంది. చోప్రా ఆడిటోరియం, హెచ్ క్యూ ట్రెయినింగ్ కమాండ్, కృష్ణా ఎయిర్ ఫోర్స్ – జలహళ్లి, శివ్ దత్తా క్యాంప్ సెంటర్, ఆర్ఎస్ఐ మూవీ మోక్షా, పారాష్యూట్ రెజిమెంటల్ సెంటర్, ఎయిర్ ఫోర్స్ ఎలహంక, వైజీ హాల్ బెల్గావి, ఎమ్ఈజీ సెంటర్ లలో భారత ఆర్మీ కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పటికే కర్ణాటకలో స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుని కథ కాబట్టి ఆర్మీ వాళ్లకి ఈ సినిమాతో కనెక్ట్ అవుతారని భావించి డిస్ట్రిబ్యూటర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ముదావహం.

 


చిరంజీవికి కర్ణాటకలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. 1993లో ముఠామేస్త్రీ సినిమాతో ఆయనకు అక్కడ క్రేజ్ ఏర్పడింది. కన్నడలో సైరా కూడా సేఫ్ జోన్ లో ఉంది. చిరంజీవి సినిమాలతోపాటు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలకు కూడా అక్కడ క్రేజ్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: