పెద్దల సినిమా ఇండస్ట్రీ నుంచి సన్నీలియోన్ బాలీవుడ్ కు వచ్చింది.  బాలీవుడ్ కు వచ్చిన కొత్తల్లో ఆమెతో కలిసి నటించేందుకు పాపం చాలా ఇబ్బందులు పడ్డారు.  ఆమెతో కలిసి నటిస్తే తమ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ జరుగుతోందో అని భయపడ్డారు.  కానీ, వారు అనుకున్నంతగా అక్కడ ఏమీ జరగలేదు.  అంతా మామూలుగానే ఉండిపోయింది.  కొంతకాలం తరువాత సన్నీలియోన్ తో సినిమా చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పిన వ్యక్తులు చాలామంది ఉన్నారు.  


ఒకవైపు సినిమాలు చేస్తూనే సన్నీలియోన్ మరోవైపు వ్యాపారంపై కూడా దృష్టి పెట్టింది.  స్టార్ స్టక్ అనే సౌందర్య ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పోయింది.  ఈ ఉత్పత్తులకు తానే స్వయంగా ప్రమోషన్ చేస్తున్నది.  దీంతో పాటు పిల్లలను దత్తత తీసుకొని పెంచుతోంది.  మరోవైపు స్వచ్చందసేవా కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నది.  ఇలా ఇన్నిరకాల పాత్రలు పోషిస్తున్న సన్నీలియోన్ గత విషయాలను గురించి ఎప్పుడో మర్చిపోయింది.  


కానీ మనవాళ్ళు మాత్రం సన్నీలియోన్ అంటే పోర్న్ మూవీస్ అనే గుర్తుపెట్టుకుంటారు.  అది మాములే కదా.  ఇదిలా ఉంటె, ఈమె నటించిన రాగిణి ఎంఎంఎస్, రాగిణి ఎంఎంఎస్ 2 సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  ఇప్పుడు రాగిణి ఎంఎంఎస్ రిటర్న్ పేరులో వెబ్ సీరీస్ తీస్తున్నారు.  ఈ వెబ్ సీరీస్ లో సన్నీలియోన్ తో పాటు తెలుగు నటుడు నవదీప్ కూడా నటిస్తుండటం విశేషం.  


సన్నీలియోన్ తో కలిసి నటించడం చాలా బాగుందని, సన్నీలియోన్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటుందని నవదీప్ పేర్కొన్నాడు.  తన గురించి తెలిసిన వ్యక్తులు ఆమెతో ఎందుకు అంత చనువుగా ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.  ఒక్కసారి కలిసి మాట్లాడితే.. చాలు దగ్గరైపోతారు.  కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారు.  అదే మరి సన్నీలియోన్ అంటే.. అదే మంత్రాన్ని సన్నీ తన వ్యాపారంలో కూడా పాటిస్తోంది కాబట్టే ఆమె హిట్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: