అయ్యో నేనా అనే అమాయకపు చూపులతో.. ఏ హీరోకైనా చూడగానే ముద్దొచ్చొ రూపం ఆమె..ఏ పాత్రకైనా కూడా ఆమె ఇట్టే ఒదిగిపోయి నటించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాలలో ఎంత చురుకుగా పాల్గొంటుందో అంతకు మించిన అందంలో తో ఈవెంట్స్ లో అందరి మనసును తనవైపు లాగేసుకుంటుంది. ఎన్నో సక్సెస్ సినిమాలలో ఈమె నటించింది. ఇక అక్కినేని వారింట కాలుపెట్టింది. ఆమె క్యూట్ ముద్దుగుమ్మ సమంత. పెళ్లైయ్యాక విజయం ఈమె ఇంటిపేరైంది. వరుస సినిమాలలో విజయంతో దూసుకుపోతుంది. 


విషయానికొస్తే.. ఎంతవరకు ఈమె చేసిన సినిమాలన్నీ కూడా పాత్రకు ప్రాధాన్యం ఇచేలా చాలా కూల్ అండ్ రొమాంటిక్ పాత్రలే. అయితే ఆ పాత్రలకు మంచి గుర్తింపు కూడా లభించింది. నాతో ఆట ఒక్కొక్కరికి మాములుగా ఉండదు అంటూ ఇప్పుడు విలన్ పాత్రలో నటించి మెప్పిస్తానంటూ ముందుకొచ్చింది. సినిమాలలో కాదులెండి. ఈ మధ్య వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ వెబ్ సిరీస్ లో నటించి మంచిపేరును సంపాదించాడు. 


దీనితో చాలా మంది ఈ వెబ్ సిరీస్ లో నటిస్తే మంచి పేరు వస్తుందని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగులోని చాలా మంది ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. జగపతి బాబు, నాగబాబు వంటి స్టార్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలలో నటిస్తున్నారు. ఐతే, ప్రస్తుతం సమంత కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ముందుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత కూడా ప్రధాన పాత్రలో నటిస్తుంది. 


ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తో దర్శకులు సంప్రదింపులు జరిపి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారమైంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో సమంత పెర్ఫామ్ చేయనుందని తెలుస్తోంది. టాప్ హీరోయిన్ ఇలా చిన్న వెబ్ సిరీస్ చేయడమేంటి అనుకోకండి..ఇది కనుక సక్సెస్ అయితే ఆమె తన సొంత నిర్మాణంలో ఈ వెబ్ సిరీస్ లను తెరకెక్కించాలని ఆలోచనలోఉన్నట్లు సమాచారం. అయితే విలన్ పాత్రలో సామ్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: