మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయితే నిజంగా గ్రేట్. కానీ మ్యాజిక్ అంటేనే ఒక్కసారి మాత్రమే వర్కౌట్ అవుతుందని అంటారు. ఇపుడు  ఆర్డీఎక్స్ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఆర్డీఎక్స్ 100 తో పాయల్ రాజ్ పుత్ గ్లామర్ బాంబ్ గా బయటకు వచ్చింది. అందాల కోసం ఎపుడూ వేటాడే టాలీవుడ్ కి పాయల్ అద్భుత  సౌందర్యంగా  కనిపించింది. అయితే పాయల్ కి ఈ హిట్ వల్ల దక్కిందేంటి...


అని ఆలోచిస్తే పెద్దగా లేదనే చెప్పాలి. ఓవర్ నైట్ స్టార్ డమ్  ఆమెకు రాలేదు. టాప్ హీరోయిన్ అయిపోలేదు. యంగ్ హీరోల  పక్కన అవకాశాలు కూడా లేవు. వెంకీ మామతో వెంక‌కేష్ పక్కన జోడీ కట్టిందంతే. మరి ఇంతటి అందగత్తె ఆర్డీఎక్స్ 100 అంటూ హల్ చల్ చేస్తే వచ్చిన రెస్పాన్స్ అది.  మళ్ళీ ఇపుడు పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఆర్డీఎక్స్ లవ్ పేరిట మూవీ రెడీ అయింది. ఈ రోజు ధియేటర్లకు ఆ మూవీ వచ్చేసింది. మరి పాయల్ గ్లామర్ తో అలరిస్తుందా అన్నది చూడాలి. ఈ సినిమాకు హీరో పాయల్ అన్నాడు హీరో తేజాస్. కేవలం పాయల్ అందాలను చూపించి సినిమా తీయలేదు, ఇది అంచి కంటెంట్ ఉన్న మూవీ అంటున్నారు చిత్ర యూనిట్. 


గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా కుమ్మేసింది అంటున్నారు డైరెక్టర్ శంకర్ భాను మరి పాయల్ అందాల కోసమే ఆర్డీక్స్ ని సక్సెస్ చేసిన వారికి ఈ మూవీ ఎలాంటి ఫీల్ ఇస్తుందో చూడాలి. మొత్తానికి ఆర్డీఎక్స్ బాంబ్ అంటే మాత్రం పాయల్ గుర్తుకురాక మానదు. తెలుగుసినిమా ఎంతో మంది హీరోయిన్లను చూసింది. కానీ డేరింగ్ గా పాయల్ లాంటి గ్లామర్ ఫిగర్ అందాల ఆరబోత మాత మాత్రం ఆర్డీఎక్స్ 100 నుంచే మొదలైందని చెప్పాలి. ఇక ఆర్డీఎక్స్ లవ్ స్టిల్స్ కూడా అదుర్స్ అన్నట్లుగానే ఉన్నాయి. ఫుల్ రొమాంటిక్ ఫోజుల్లో హీరో హీరోయిన్లు కవ్విస్తున్నారు. మరి ఈ మూవీ కూడా ఆర్డీఎక్స్ 100 లాగా టాప్ హిట్ గా నిలుస్తుందా. ఈ దెబ్బతోనైనా పాయల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ట్యాగ్ దక్కించుకుంటుందా చూడాలి. ఈ రోజే వస్తున్న ఈ గ్లామర్ బాంబ్ సత్తా ఎంటో యూత్ గుండెలే  చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: