సాధారణంగా అమ్మాయిల వయసు అడగకూడదు. ఎందుకంటే అదే వారికి అందం, ఆకర్షణ కాబట్టి. అయితే సినిమా హీరోయిన్ల వయసు ఎపుడూ పదహారే అంటారు. కానీ అధునిక కాలంలో గూగుల్ సెర్చ్ చేయగానే ప్రతీ హీరోయిన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తోంది. దాంతో ఇప్పటికింకా నా వయసు పదహారే అని చెప్పడానికి వీల్లేదు. ఇపుడు టాలీవుడ్ హీరోయిన్ల వయసు తీసుకుంటే టాప్ ప్లేస్ లో ఉన్నవారంతా 30 ఏళ్ళు దాటిన వారే.
ఇపుడు ఆ లిస్ట్ లోకి కొత్తగా
రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిచేరింది. నిన్ననే తన 29వ బర్త్ డేని రకుల్ చేసుకుంది. ఎవరికీ చెప్పకుండా
థాయిలాండ్ లో కేవలం తన తల్లిదండ్రులు సన్నిహితుల మధ్యన రకుల్ చేసుకున్న ఈ బర్త్ డే ఇపుడు వెలుగులోకి వచ్చింది. తన పేరేంట్స్ కి కిస్సులు ఇస్తున్న రకుల్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా రకుల్ కి మన్మధుడు 2 మూవీ డిజాస్టర్ తరువాత తెలుగులో చాన్సులు లేవు. అంతకు ముందు ఆమె స్పైడర్ మూవీ
మహేష్ బాబు తో చేసింది. అది భారీ డిజాస్టర్ అయింది. దాంతో రకుల్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇపుడు కెరీర్ దారుణంగా ఉంది. ఇక బాలీవుడ్లో సైతం ఆమె కెరీర్ సాగడంలేదు.
స్లిమ్ గా తయారవ్వాలని రకుల్ చేస్తున్న ఎక్సర్ సైజులు చివరికి ఆమె గ్లామర్ ని, చార్మ్ ని లాగేసుకున్నాయి. దాంతో రకుల్ అంటే టాలీవుడ్ పెద్దగా ఇంటెరెస్ట్ చూపడంలేదంటున్నారు. అదే సమయంలో రకుల్ బ్రదర్ సినిమాల్లోకి వస్తాడని టాక్ కూడా వినిపించింది. అది కూడా జరగలేదు.
ఇపుడు ముప్పయ్యేళ్ళు వచ్చాయి కాబట్టి రకుల్ పెళ్ళి గురించి చర్చ కూడా మొదలైంది. ఎటూ అవకాశాలు లేవు కాబట్టి రకుల్ పెళ్ళికి రెడీ అంటున్నారుట. పేరెంట్స్ తో రకుల్ చేస్తుకున్న ఈ బర్త్ డే సంబరం వచ్చే ఏడాది నాటికి బెటర్ హాఫ్ వరకూ సాగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మొత్తానికి ఇలా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో వచ్చిన రకుల్ అలా తొందరగానే ఫేడౌట్ అయి వెళ్ళిపోవడం మాత్రం చిత్ర విషాదమే.