90 లో సినిమా లోకాన్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్లు తాజాగా రీ ఎంట్రీ ఇస్తూ వరుస అవకాశాలు దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఎంట్రీ ఇచ్చి సినిమాపై ఇండస్ట్రీలోనూ మరియు మహేష్ అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచారు. ఈ సినిమాల్లోకి రీ ఎంట్రీ రాకముందు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా విజయశాంతి వ్యవహరించడం జరిగింది.


ఇదిలా ఉండగా ఇదే బాటలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారపార్టీ వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా..చాలా కాలం తర్వాత బాలకృష్ణతో నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఒక పక్క రాజకీయాలు చేస్తూ మరో పక్క బుల్లితెరపై జబర్దస్త్ వంటి రియాల్టీ షోలలో రాణిస్తున్న రోజా త్వరలో బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే సినిమాలో నటిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. బాలకృష్ణ రోజా కాంబినేషన్ అంటే సినిమా ఇండస్ట్రీలో అది ఎవరి గ్రీన్ కాంబినేషన్ అని చాలామంది అంటారు.


కాగా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో రోజా కోసం కావాలని బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేశారట. అంతేకాకుండా రోజా నటించబోయే క్యారెక్టర్ నెగిటివ్ గా కనిపించే పాజిటివ్ పాత్ర అదని, ఇంట్రవెల్ వద్ద రివీల్ అయ్యే ఈ క్యారక్టర్ సెకండాఫ్ అంతటా ఉంటుందని సమాచారం. అయితే ఈ పాత్ర రోజా అయితేనే న్యాయం చేయగలదని భావించి బోయపాటి ఆమెను ఒప్పించే పనిలో పడ్డారట. కానీ ఈ పాత్ర చేయడం కోసం రోజా కొద్దిగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ పాత్ర రాజకీయాలను టచ్ చేస్తుందని , అందుకే రోజా ఒప్పుకోవటం లేదని ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: