టాలీవుడ్ లో నిర్మాతగా,  కేరక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ చందర్.  ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకి ఈయన మనవడు.  విజయచందర్ తల్లి పుష్పావతి, ప్రకాశం పంతులు కూతురు. తండ్రి తెలిదేవర వెంకట్రావు హోమియోపతి వైద్యుడు. విజయ చందర్ చిన్ననాటి నుంచి నాటకాలపై ఎక్కువగా మోజు చూపించే వారు..ఎన్నో నాటకాలు కూడా వేశారు.

విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు తదితరులు స్థాపించిన రాఘవ కళాసమితిలో అనేక నాటకాల్లో పాల్గొన్నాడు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మరో ప్రపంచం సినిమాలో జర్నలిస్టుగా అవకాశం ఇచ్చారు. తర్వాత కె.ఆర్.విజయ ప్రధాన పాత్రలో నిర్మించిన దేవీ లలితాంబ సినిమాలో విలన్ గా నటించాడు. తర్వాత ఆయన జీవితం ఒక్కసారే మలుపు తిరిగింది.  విజయ చందర్ కి కరుణామయుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది..అప్పట్లో ఈ మూవీ అన్ని వర్గాల వారికి బాగా నచ్చింది. 

రాజాధిరాజు, దయామయుడు, ఇలా వరుసగా సినిమాలు నిర్మించాడు. 1985 లో దర్శకుడు పి.వాసు తీసిన షిరిడీ సాయిబాబా మహత్యం ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన మరో సినిమా. ఇంకా ఎన్.శంకర్ తీసిన భద్రాచలం సినిమా కూడా మంచి పేరు తీసుకుని వచ్చింది. తాజాగా విజయ చందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కరుణామయుడు సినిమా నేను ఎంతో కష్టపడి తీశాను..దానికి తగ్గ ఫలితం కూడా వచ్చింది.  ఈ సినిమాకు అప్పట్లో 30 లక్షలు వచ్చాయి..దాంతో ‘రాజాధిరాజు’ సినిమాను నిర్మించాను.

కానీ, ఈ సినిమా దారుణమైన ఫలితం వచ్చింది..థియేటర్లో ఖాళీ సీట్లతో దర్శనమిచ్చాయి. దాంతో నేను ఒక్కసారిగా కష్టాల్లో పడిపోయాను. తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ ఆ కష్టాల నుంచి గట్టెక్కానని అన్నారు విజయ చందర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: