ఒక్కరాత్రిలో హీరో అవ్వడం అంటే కొంచం కష్టమే కానీ, చాలా అరుదు కూడా. ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చి పెళ్లి చూపులతో హీరోగా తెలుగు తెరకు పరిచమైన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పేరు సంపాదించడమే కాదు.. బాగా పాపులర్ అయ్యాడు కూడా. యుత్తో లో బాగా క్రేజ్ కూడా వచ్చింది కూడా. అలా ఆ కుర్రోడు సినిమా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాలలో నటిస్తూ వచ్చారు. 


విజయ్ సినిమాలు చేసి పాపులర్ అవ్వడం ఒక ఎత్తైతే ఏ ఈవెంట్ కు వెళ్లిన కూడా స్టేజ్ పై అతఃను చూపించే యాటిట్యూడ్ పీక్స్ అనే చెప్పాలి. దానితో యూత్ అతనికి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకేనేమో అయన ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇకపోతే విజయ వరుస సినిమాలు విజయాలు అయ్యాయి. కానీ, చివరి సినిమా డియర్ కామ్రేట్ సినిమా మాత్రం అతనికి డిజాస్టరుగా మిగిలింది. 


విజయానికొస్తే గతంలో విజయ్ దేవరకొండ రౌడీ షర్ట్స్ కి బ్రాను ఎంబాజిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ ప్రస్తుతం క్రాంతిమాధవన్  
దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బ్రేకప్ వరల్డ్ ఫెమస్ లవర్ పేరుతో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. 


మరోవిశేషమేంటంటేప్రముఖ ఫిలిం మేగజైన వోగ్‌ కోసం విజయ్‌ దేవరకొండ చేసిన ఫోటోషూట్‌ స్టిల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాగజైన్ లో సినిమా విషయాలతో పాటుగా పర్సనల్ జీవితాన్ని కూడా అందులో పంచుకున్నారు. ఈ మ్యాగజైన్ కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఫోటో షూట్ చేశారు. రౌడీ లుక్ తో ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్లో దర్శనమిస్తూ అందరిని ఆకట్టుకున్నాయి.. మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసుకోండి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: