కాలం కలిసొస్తే.. ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఓ ఉదాహరణ అమితాబ్ జీవితం.  కష్టపడకుండా ఏది ఊరికే రాదు. ఊరికే వచ్చింది అంటే అది మీ దగ్గర నిలబడదు.  లక్ష్యం కోసం కోసం కష్టాన్ని నమ్ముకుంటే ఆ కష్టమే నిలబెడుతుంది.. గెలిపిస్తుంది.  అలాంటి వ్యక్తి అమితాబ్ బచ్చన్.  అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి రావాలనే తపన చిన్నతనం నుంచే ఉండేది.  చిన్నతనంలో కొన్ని నాటకాలు వేశారు... ఆ నాటకాల్లో మెప్పించిన అమితాబ్ ఢిల్లీ వెళ్లి ఆల్ ఇండియా రేడియోలో పనిచేద్దామని అనుకున్నారు.  


కానీ, గొంతు బాగాలేదని పంపించేశారట.  ఆ తరువాత కోల్ కతా వెళ్లి అక్కడ షిప్పింగ్ లో జాయిన్ అయ్యారు.  ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు.  వెంటనే అక్కడి నుంచి ముంబై వెళ్లి సినిమాల్లో ట్రై చేసేందుకు ప్రయత్నం చేశారు.  సినిమా ఆఫీసులకు వెళ్తే గొడుగు కర్రలా ఉన్నావు.. సినిమాల్లో పనికిరావని బయటకు నెట్టారాట.  బంతిని నెలకు కొడితే పైకి లేస్తుంది అన్న చందాన అవమానాలు ఎదురైయ్యే కొలది.. అమితాబ్ లో పట్టుదల పెరిగింది.  


ఎలాగైనా సరే సినిమాల్లో ఛాన్స్ సంపాదించాలని అనుకున్నారు.  1969లో వచ్చిన భువన్ షోమ్ లో చిన్న పాత్ర చేశారు.  అది ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఏడుగురు నటుల్లో ఒకరిగా కనిపించారు.  ఏడుగురిలో అమితాబ్ గొంతుకు మంచి పేరు వచ్చింది.  ఆ తరువాత ఓ యాడ్ ఫిలిం చేసే అవకాశం వచ్చింది.. కానీ డబ్బు ముఖ్యం కాదని సినిమానే ముఖ్యమని భావించిన అమితాబ్ దాన్ని పక్కన పెట్టారు.  చిన్నగా నటుడిగా హీరోగా నిలదొక్కుకున్నారు.  


ఏ గొంతైతే బాగాలేదని ఎగతాళి చేశారో.. ఆ గొంతుకోసమే కోట్లు గుమ్మరిస్తున్నారు.  అమితాబ్ స్వరం ఉంటేచాలు సినిమా హిట్ అవుతుందని నమ్మి సినిమాలు తీసిన వ్యక్తులు బోలెడంతమంది ఉన్నారు.  ఒకానొకదశలో దాదాపు 50 కిపైగా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుంటూ వెళ్లారు.  70 సంవత్సరాల వయసులో కూడా తీరికలేనంతగా బిజీగా ఉన్నారు. ఒక్క బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.  మరో ఏడాదిపాటు అమితాబ్ కాల్షీట్స్ ఖాళీ లేవు అంటే అర్ధం చేసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: