బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ చాలా టఫ్ గా ఉండనుంది.  వరుణ్, రాహుల్, మహేష్ విట్టలు నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియట్లేదు. ప్రేక్షకులు కూడా ఎవరికి ఓటేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎవరిని ఇంటి నుండి పంపించాలి అనే దానిపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు కనబడుతున్నాయి. వీటన్నింటి మధ్య ఓటింగ్ లో చాలా మార్పులు వచ్చినట్టు అనిపిస్తుంది.


నామినేషన్ లో ఉన్న ముగ్గురికి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది. ఆ అభిమానుల ఓట్లు తప్పకుండా వారికే పడతాయి. అయితే మిగతా కంటెస్టెంట్ల అభిమానుల ఓట్లు ఎవరికి వేస్తారో గమనిస్తే, బాబా భాస్కర్, శ్రీముఖి అభిమానుల ఓట్లు మహేష్ కి పడే అవకాశం ఉన్నప్పటికీ, ఈ విషయంలో వాళ్ళు కొంత అయోమయానికి గురవుతున్నారు. రాహుల్ కి బయట ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. అదీగాక పునర్నవి అభిమానుల ఓట్లు రాహుల్ కే పడతాయి.


పునర్నవి రాహుల్ కి మద్దతుగా క్యాంపెయిన్ కూడా రన్ చేస్తుంది. ఇక వరుణ్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అతను హీరో అవడం వల్ల ఆ అభిమానంతో ఓటేసే వాళ్ళున్నారు. అందువల్ల ఎలిమినేషన్ లో హై టెన్షన్ చోటు చేసుకుంటుంది. కాకపోతే ఈ ముగ్గురిలో మహేష్ కే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ ఈ మధ్య అందరికీ శత్రువులా మారిపోయాడు.


ఇక్కడి విషయాలు అక్కడ చెప్పడం వల్ల ప్రేక్షకుల్లో అతనిపై వ్యతిరేకత బాగా పెరిగింది. అందరితో స్నేహంగా ఉండాలనుకున్న మహేష్ కి ఎవ్వరితో కూడా సరైన స్నేహం లేకుండా పోయింది. హౌస్ మెంబర్స్ సైతం ఎవరూ నమ్మడం లేదు. దీంతో ఈ వారం మహేష్ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: