విజయ్ దేవరకొండ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. యూత్ లో విజయ్ దేవరకొండకి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.  విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యూత్ ఎగబడి మరీ చూస్తుంటారు. అయితే విజయ్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినప్పటికీ విజయ్ కి సరైన జోడి అనిపించుకున్న హీరోయిన్ మాత్రం రష్మిక మందన. గీత గోవిందం లో వీరిద్దరూ కలిసి నటించారు. 

 

 

 

 

 గీత గోవిందం లో వీళ్ళ క్యూట్ రొమాన్స్ కి ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో  రష్మిక విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ అందరినీ ఆకర్షించింది. అయితే ఈ లిప్ లాక్ సీన్ పై నటి  హరిప్రియ ఆసక్తికర  కామెంట్ చేసింది. ఎల్లిదే ఇల్లితనక  అనే కన్నడ చిత్రంలో ప్రస్తుతం హరిప్రియ నటిస్తోంది. సినిమాలో హీరో సృజన్ లోకేష్ హీరోయిన్ హరిప్రియ మధ్య ఉన్న ఓ  లిప్ లాక్ సీన్... గీత గోవిందం లోని లిప్ లాక్ సీన్ ను  పోలి ఉంటుంది అని ప్రేక్షకులు చెబుతున్నారు. 

 

 

 

 ఈ విషయంపై స్పందించిన హరిప్రియ గీత గోవిందం సినిమాలు విజయ్ దేవరకొండ రష్మిక మధ్య అదర చుంబనం ఉండగా... ఎల్లెదే ఇల్లితనకా   సినిమాలో కేవలం మామూలు ముద్దు సీన్ మాత్రమే ఉందని హరిప్రియ తెలిపింది. నా ఫ్యాన్స్ ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే వీలుండే  సినిమాల్లోనే నేను నటిస్తానని హరిప్రియ తెలిపింది . కథ డిమాండ్ చేయడం వల్లనే ఆ ముద్దు సీను నటించానని హరిప్రియ తెలిపింది . కాగా టాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాలు చేసింది హరిప్రియ. నాని సరసన పిల్ల జమిందార్... బాలయ్య సరసన జై సింహా లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: