ఆన్ స్క్రీన్ ఎవరైనా హీరో అవ్వొచ్చు కాని ఆఫ్ స్క్రీన్ హీరో అయ్యే వాడికే ఓ రేంజ్ ఉంటుంది. కోలీవుడ్ హీరో సూర్య రియల్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తను ముందు స్పందించే సూర్య లేటెస్ట్ గా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.   


హీరో సూర్య తమిళ దర్శకుల సంఘానికి 10 లక్షల విరాళం అందించాడు. 10 లక్షల చెక్ ను దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్వి ఉదయ్ కుమార్ కు అందించారు. దర్శకుల సంఘం సంక్షేమం కోసం ఈ డబ్బుని అందచేస్తున్నట్టు సూర్య చెప్పుకొచ్చారు. సూర్య దర్శకుల సంఘం మీద చూపించిన అభిమానం, ప్రేమకు సంఘ అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి, కోషాధికారి పేరరసులు సూర్యకు కృతజ్ఞతలు తెలియచేశారు.


ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే సౌత్ లో అందరి కన్నా ముందు స్పందించే హీరో సూర్య. కేరళ ఫ్లడ్స్, విశాఖ తుఫాను టైంలో కూడా అతను చేసిన ఆర్ధిక సాయం చాలా గొప్పది. కేవలం తమిళ హీరోగానే కాదు తెలుగు పరిశ్రమలో కూడా సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన గజిని సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది.     


అప్పటినుండే తెలుగులో సూర్యకు మాంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటికి సూర్య ఏ సినిమా చేసినా సరే అది తెలుగులో రిలీజ్ అవుతుంది. రజినికాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో స్టార్ గా తమిళ హీరో సూర్య మాత్రమే ఆ క్రేజ్ వచ్చింది. సూర్య తర్వాత అతని తమ్ముడు కార్తి కూడా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. సూర్య, కార్తి బ్రదర్స్ ఇద్దరు తెలుగు ప్రేక్షకుల మీద అభిమానం చూపిస్తూ ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: