ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అనే పదానికి కరెక్ట్ గా సరిపోయే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 అనే చిన్న సినిమాతో స్టార్ హీరోయిన్ల పక్కన చేరి పోయింది పాయల్ రాజ్ పుత్. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ చేయలేనంత బోల్డ్ పాత్రల్లో  పాయల్ రాజ్ పుత్ నటించి యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్ఎక్స్ 100 మూవీ అంత సెన్సేషన్ హిట్ అవ్వడానికి పాయల్ రాజ్ పుత్ చేసిన పాత్ర... ఆ పాత్రలో ఆమె నటన సినిమాకి ఒక వెన్నుముక లాంటివనే చెప్పాలి. అయితే ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆర్డీఎక్స్ లవ్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్ పాప . 

 

 

 

 

 

 అయితే ఆర్ఎక్స్ 100 లోనే  అందాల ఆరబోతతో ప్రేక్షకులకు చెమటలు పట్టించిన పాయల్ రాజ్ పుత్... ఆర్డీఎక్స్ లవ్ లో రొమాన్స్ డోస్  ని ఇంకాస్త పెంచేసింది. చిత్రబృందం కూడా ఎక్కువగా పాయల్ రాజ్ పుత్ గ్లామర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకి  సంబంధించిన టీజర్,  పోస్టర్లలో  కూడా... పాయల్ గ్లామర్ నే  చూపిస్తూ అందరిని అట్రాక్ట్  చేసే ప్రయత్నం చేస్తున్నారు చిత్రబందం . అయితే తాను బోల్డ్ పాత్రల్లో  చేయడం పట్ల తన ఫ్యామిలీ ఎలా ఫీలవుతుందని విషయాన్ని పాయల్ రాజ్ పుత్ వెల్లడించింది. తను ఏదైనా సినిమాని ఒప్పుకున్నప్పుడు ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పేస్తుందట పాయల్ . 

 

 

 

 

 

సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తున్నాను... ఎన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి... ఎన్ని బోల్డ్  సీన్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా వాళ్ళ  అమ్మకి చెబుతుందట ఈ ముద్దుగుమ్మ . తమ కుటుంబం తన  నిర్ణయం పై నమ్మకంతో ఉంటారని పాయల్ రాజ్ పుత్ తెలిపింది. అయితే బోల్డ్ సీన్స్ నటించగలను గాని... ఆ సినిమాలను తన కుటుంబంతో కలిసి చూడాలంటే మాత్రం కాస్త కష్టమే అని చెప్పింది పాయల్.  అందుకే ఇప్పటివరకు ఆర్ఎక్స్ 100 సినిమాని కుటుంబంతో కలిసి చూడలేదని పాయల్ రాజ్ పుత్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఆర్డీఎక్స్ లవ్ సినిమాను  మాత్రం అమ్మానాన్నలతో కలిసి చూస్తా అంటుంది పాయల్ పాప.

మరింత సమాచారం తెలుసుకోండి: