ఆర్ ఎక్స్ 100 సినిమా తో  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈచిత్రంతో ఓవర్ నైట్ లో గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే  బోల్డ్ పాత్రలో నటించి  యూత్ ను  ఫిదా చేసింది పాయల్.  ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో  పాయల్ కు  వరిసగా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా  పాయల్  లీడ్ రోల్ లో నటించిన  తాజా చిత్రం  ఆర్ డి ఎక్స్ లవ్.  టీజర్ , ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది.  అయితే మార్నింగ్ షోస్  నుండి  వస్తున్న టాక్ ప్రకారం  సినిమా  చాలా బోరింగబోరింగ్ ఉందని తెలుస్తుంది.  సిల్లీ  స్టోరీ తో  దర్శకుడు సినిమాను లాగించేసాడని  ఎక్కడా ఒక్క హై మూమెంట్ కూడా లేదని..  పాయల్ మాత్రం తన పాత్ర కు న్యాయం చేసిందని క్రిటిక్స్  అంటున్నారు.  ఇక  దసరా సెలవులు కూడా అయిపోయాయి.  పైగా ఈ చిత్రం విడుదలవుతున్నట్లు కూడా ఎవరికి తెలియదు. సో  బాక్సాఫీస్ వద్ద ఈసినిమా గట్టెక్కడం  దాదాపు అసాధ్యమే. 



నూతన దర్శకుడు శంకర్ భాను  డైరెక్ట్ చేసిన  ఈ చిత్రంలో  'హుషారు' ఫేమ్  తేజస్ కంచర్ల  పాయల్ కు జోడిగా నటించాడు.సి కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించిన  ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందించాడు. ఇక ప్రస్తుతం  పాయల్ రాజ్ పుత్   తెలుగులో  మరో రెండు  క్రేజీ సినిమాల్లో నటిస్తుంది.  అందులో ఒకటి వెంకీ మామ కాగా రెండవది డిస్కో రాజా.   మల్టీ స్టారర్  గా తెరకెక్కుతున్న వెంకీ మామ చిత్రంలో పాయల్  వెంకటేశ్ కూడా జోడిగా నటిస్తుండగా మాస్ రాజా  రవితేజ నటిస్తున్న డిస్కోరాజా లో ఓ హీరోయిన్ గా నటిస్తుంది.  మరి ఈ రెండు సినిమాలు పాయల్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: