మన దక్షిణాది సినిమాలన్నా, ఇక్కడివారన్నా ఉత్తరాది వారికి అంతగా పడదు. అయితే ఇక్కడి కథలను మాత్రం ఎత్తుకుపోయి అక్కడ సొమ్ము చేసుకుంటారు. అందులో మాత్రం ఏమీ మొహమాట పడరు. కానీ మనవాళ్లు అక్కడికి వెళ్లి.. ఏదైనా సాధిస్తే మాత్రం ఒప్పుకోరు. ఎలాగైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. 


             అర్జున్ రెడ్డి సినిమా ఇక్కడ ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కూడా వివాదాలు చుట్టుముట్టాయి. వాటితో పాటే సినిమా కూడా జనాల్లోకి చొచ్చుకుపోయింది. అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన సందీప్ రెడ్డి.. హిందీలో కబీర్ సింగ్‌ను రీమేక్ చేశాడు.  అయితే ఓ తెలుగు డైరెక్టర్ బాలీవుడ్‌కు వెళ్లి అంత క్రేజ్ సంపాదించుకోవడం. కొందరికి నచ్చలేదు. మీడియా సమావేశంలో కూడా సందీప్‌ను చిన్నచూపు చూడటం.కబీర్ సింగ్ పాత్రపై బాలీవుడ్‌లోని ఓ వర్గం మీడియా కావాలనే పనిగట్టుకుని దుమ్మెత్తిపోసింది. హీరో క్యారెక్టర్ పై  నెగిటివిటీ ప్రచారం చేశారు. కానీ సినిమా ఎవరు అనుకోని విధంగా సూపర్ హిట్ అయింది.


  మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాను బాలీవుడ్ మీడియా చిన్నచూపు చూసింది. సినిమాకు సంబంధించిన వార్తలు, రివ్యూలు, కలెక్షన్లు ఇలా ఏ ఒక్కటి కూడా రాయడం లేదు. అయితే వీటిపై చిర్రెత్తిన ఓ అభిమాని. రివ్యూ రైటర్లను ఘాటుగా ప్రశ్నించాడు. రివ్యూ రాయకుండా ఉండేందుకు ఎంత తీసుకున్నావ్ అంటూ రాజీవ్ మసాంద్, తరణ్ ఆదర్శ్, అనుపమచోప్రాఅను ప్రశ్నించాడు.       


       దీనికి  రాజీవ్ మసాంద్ స్పందిస్తూ.. రెండు వందల రూపాయలంటూ రిప్లై ఇచ్చాడు.  చిరంజీవి ఫ్యాన్స్ పేజి నడుపుతున్న ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. వంద రూపాయలు వార్ రివ్యూ రాయడానికి, వంద రూపాయలు సైరా రివ్యూ రాయకుండా ఉండడానికి అంటూ సెటైరికల్‌గా కామెంట్ పెట్టాడు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ.. సార్.. వార్‌ సినిమాకు నేను ఇచ్చిన రివ్యూ చూసి మాట్లాడండి అంటూ అసహనానికి గురైనట్టు కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: