మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా అక్టోబ‌ర్ 2న ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించ‌గా.. మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవహరించాడు. రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చూస్తే జ‌స్ట్ ఓకే ఓకే మాత్ర‌మే అనిపిస్తోన్న ఈ సినిమా మిగిలిన భాష‌ల్లో మాత్రం చీదేసింది. ముందుగా సినిమాకు చేసిన విప‌రీత‌మైన హైప్‌, ప్ర‌చారం నేప‌థ్యంతో పాటు పాజిటివ్ రివ్యూలు, రేటింగులు రావ‌డంతో వ‌సూళ్ల దుమ్ము రేపుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే వ‌సూళ్లు మాత్రం షాక్ ఇచ్చేలా ఉన్నాయి.


తెలుగులో కూడా సూప‌ర్ సూప‌ర్ అంటున్నా ఇక్క‌డ కూడా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా చాలా దూరంలో ఉంది. అయితే సైరా అంత వ‌సూలు చేసింది.. ఇంత వ‌సూలు చేసిందంటూ వ‌స్తోన్న క‌లెక్ష‌న్ల‌పై సైరా యాంటీ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. సినిమాను బ్లాక్ బస్టర్ అనిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని యాంటి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. వీరంతా  #SyeRaaFakeCollections  అంటూ ఒక హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ చేస్తున్నారు.


రిలీజ్‌కు ముందు ఉన్న ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు.. ఇప్పుడు చూపిస్తోన్న లెక్క‌ల‌కు చాలా తేడా ఉందంటున్నారు. సైరా అమెరికాలో భారీ రేట్ కు అమ్ముడు పోయిందని బ్రేక్ ఈవెన్ టార్గెట్  $4 మిలియన్లని అన్నారు.. ఇప్పుడేమో 3 మిలియన్లే టార్గెట్ అంటున్నారని.. కొన్ని రోజులు ఆగితే $2 మిలియన్లకు తగ్గించినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేదంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం గ్రాస్ వ‌సూళ్ల‌నే షేర్లుగా చూపిస్తున్నార‌ని సెటైర్లు వేస్తున్నారు.


ఏదేమైనా సైరా ఫేక్ కలెక్షన్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైన చెప్పుకున్న హ్యాష్ టాగ్ తో పాటుగా  #syeraafakeraa #syeraadisaster కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: