మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం సైరా. ఈ చిత్రం తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. తెలుగునాట ఎంతగానో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. సైరాను వీక్షించిన సినీ పెద్దలు చిత్రాన్ని., చిత్ర యూనిట్ ని ఆకాశానికెత్తేశారు. రాజకీయ ప్రముఖులు కూడా సినిమాను వీక్షించి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ "తమిళి సై సౌందరరాజన్" సైతం సైరాను వీక్షించి.. చిరంజీవిని, చిత్రయూనిట్‌ను ఎంతగానో కొనియాడారు. ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి చూపించారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, నిర్మాత.. కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి.. చిత్రయూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. రామ్ చరణ్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తమన్నా పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడి ఆనందించారు.

ఈ సినిమాకు కేవలం ప్రశంసలే కాదు.. కాసుల వర్షం కూడా బాగానే కురుస్తోంది. మొదటి రోజు 85కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి టాలీవుడ్ దమ్ముని చూపింది. రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసి రికార్డ్ కెక్కింది. తొమ్మిదో రోజుకూడా సైరా కలెక్షన్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇప్పటికే దాదాపు 195కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సైరా.. తొమ్మిదో రోజుతో రెండు వందల కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసినట్లు సమాచారం.

 అయితే తొమ్మదో రోజు సైరా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5కోట్లను వసూళ్లు చేసింది.., అనగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు దాదాపు 72శాతం రికవరీ అయినట్లు...,,, కానీ మిగతా ఏరియాల్లో (కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్, హిందీ) మాత్రం నష్టం తప్పేలా లేదని తెలుస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: