కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్.  కెరీర్ బిగినింగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..కొంత కాలంగా విజయ్ నటిస్తున్న సినిమాలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి. దాంతో తమిళ అభిమానులు విజయ్ ని ఎంతగానో అభిమానిస్తున్నారు.  విజయ్ రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటు ఉంటారు. దేశంలో ఎక్కడైనా సరే ప్రకృతి వైపరిత్యాలతో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రత్యక్షంగా సాహాయం అందిస్తుంటారు. 

తన అభిమానులంటే వల్లమాలిన అభిమానం అని అంటుంటారు. తన అభిమానులకు ఏదైనా అవసరం వస్తే వెంటనే స్పందిస్తాడు. తనే స్వయంగా వెళ్లి అభిమానుల దగ్గరకి వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ హీరో విజయ్ గురించి ఓ తమిళ దర్శకుడు మాత్రం చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు.  సామి అనే తమిళ దర్శకుడు మాట్లాడుతూ.. విజయ్ తన అభిమానుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తుంటారని, అందరూ అనుకున్నంత సౌమ్యుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ తన అభిమానులపై చూపించే ప్రేమంతా నాటకమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అతడు అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే డెటాల్ తో తన చేతులు శుభ్రం చేసుకుటాడని, అభిమానులు ఆయనకు అంత నీచంగా కనిపిస్తుంటారని సంచల కామెంట్స్ చేశారు. ఈవెంట్స్ లో అనవసరమైన విషయాలు మాట్లాడతారని, అలాంటి మాటలు ఆయన తగ్గించుకోవాలని అన్నారు. అయితే సామి ఇలా విజయ్ పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారన్న విషయం మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే దర్శకుడు సామి చేసిన వ్యాఖ్యలపై హీరో విజయ్ కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: