'సైరా నరసింహారెడ్డి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి.. అదే ఊపులో విజయ దశమి రోజున కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా  త్వరలోనే ఈ  సెట్స్ పై వెళ్లనుంది. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో మెసెజ్ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచరాం. ఈ సినిమాలో చిరంజీవి ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమచారం. మరోవైపు నక్సలైట్ క్యారెక్టర్‌ కూడా చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఆ పాత్రలో చిరంజీవి నెరిసిన జుట్టుతో కనిపించనున్నట్టు సమాచారం.

అయితే అనసూయ సాక్షి టెలివిజన్ లో వార్తా వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత ఆమె జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) లో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేరింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక పవర్ఫుల్ ప్రధాన పాత్రలో నటించింది మరియు  “రంగస్థలం”  లో మంచి పవర్ఫుల్ పాత్ర లో (రంగమ్మత్త) నటించి ఎన్నో ప్రశంసలు అందుకుంది. అంతేకాదు సాయి ధర్మ తేజ్  విన్నర్ సినిమా లో కూడా మంచి పాత్ర లో తనదయిన శైలిలో ప్రేక్షకులుని ఆకట్టుకుంది.  

అయితే చిరంజీవి సినిమాలో జబర్ధస్త్ అనసూయ ఒక పవర్ఫుల్ పాత్ర చేయబోతున్నట్టు గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేసాయి. ఇక చిరంజీవి కూడా అనసూయతో ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చేయించాలనుకున్నట్టు సమాచారం. తీరా చూస్తే.. ఈ సినిమాలో అనసూయ పాత్రకు అంత స్కోప్ లేదని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో అనసూయ నటించడమనేది డౌటే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మొత్తానికి చిరంజీవి, కొరటాల శివ సినిమాలో అనసూయ పాత్రపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: