రాజమౌళి, రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. ఎన్.టి.ఆర్ (జూనియర్)తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.రాజమౌళి తీసిన బాహుబలి(ది బిగినింగ్) మరియు బాహుబలి(ది కంక్లూజన్)సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.బాహుబలి(ది కంక్లూజన్) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్షరాలా1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.

అయితే ఈ గురవారం రాజమౌళి తన 46వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాజమౌళికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ అందజేశారు. రాజమౌళి..కొడుకు కార్తికేయ పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోను రామ్ చరణ్ షేర్ చేసాడు. ఇపుడు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక రాజమౌళి, రామ్ చరణ్ విషయానికొస్తే..గతంలో వీళ్లిద్దరు కలిసి ‘మగధీర’ సినిమా చేసారు. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది.

ప్రస్తుతం వీరిద్దరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. నందమూరి హీరో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్..కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్..ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: