తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు.  జబర్ధస్త్ ద్వారా ఇప్పటికలే కొంత మంది వెండి తెరపై తమదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నారు.  షకల శంకర్, సుడిగాలి సుధీర్ లాంటి వారు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  జబర్ధస్త్ లో అదిరే అభీ ద్వారా పరిచయం అయిన హైపర్ ఆది చాలా సైలెంట్ గా అమాయకుడిగా కనిపించాడు.  ఆ తర్వాత ఆదిలో రైటింగ్ స్కిల్స్, నటన చూసి అభి టీమ్ లీడర్ గా ప్రోత్సహించాడు. 

ఇక జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా ఎదిగిన హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్ తో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.  హైపర్ ఆది టీమ్ లో రైజింగ్ రాజు, దొరబాబు, శాంతి స్వరూప్ ఎవరి టాలెంట్ వారు చూపిస్తుంటారు. ఈ మద్య  కొత్త మూవీ వచ్చిందంటే చాలు.. హైపర్ ఆది ఆ క్యారెక్టర్ లోకి  దూరిపోతున్నాడు.  గత వారం వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. తాజాగా వస్తున్న జబర్ధస్త్ ప్రోమోలో మరో కొత్త అవతారంతో కనిపించి కడుపుబ్బా నవ్వించాడు. 

ఈ మద్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ గెటప్ లో హైపర్ ఆది దర్శనమిచ్చాడు.  రైజింగ్ రాజు ‘మగధీర’ గా, దొరబాబు బాహుబలిగా కనిపిస్తున్నారు. ఆ స్కిట్ చూస్తున్న జడ్జీలు నాగబాబు, రోజా లు పగలబడి నవ్వుతున్నారు. 2 నిమిషాల ప్రోమోలో గ్యాప్ లేకుండా పంచ్ డైలాగులు వేసాడు ఆది. ప్రోమో చూసిన తర్వాత అభిమానులతో పాటు ఆది ఫాలోయర్స్ కూడా ఈ స్కిట్ కోసం చూస్తున్నారు. మరోవైపు అక్కడే ఉన్న నాగబాబు కూడా సైరా స్పూఫ్ చూసి కడుపు పగిలేలా నవ్వుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: