టాలీవుడ్ గానీ బాలీవుడ్ గాని యంగ్ హీరో స్ ఒక్క ఫ్లాప్ పడితే రెండవ సినిమా ఒప్పుకోవడానికి ఒకే చేయడానికి 1-2 సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు. కారణం మళ్ళీ గనక ఫ్లాప్ వస్తే పరిస్థితేంటి ఉన్న మార్కెట్ పడిపోతుందేమోనని ఆలోచనలో ఆగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ వరుసగా కబాలి, కాలా, పేట సినిమాలు యావరేజ్ గా మిగిలినప్పటికి మళ్ళీ  మురగదాస్ తో దర్బార్ కి సై అన్నారు. అంతేకాదు 2020 సంక్రాంతి బరిలో ఈ సినిమాని పోటీగా దింపుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  దరువు డైరెక్టర్ శివ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 

ఇక్కడ రవితేజకు దరువు రూపంలో ఫ్లాప్ ని ఇచ్చిన ఈ తెలుగు డైరెక్టర్ తమిళంలో మాత్రం సూపర్ హిట్ డైరెక్టర్. అక్కడ ఏకంగా తళా అజిత్ కి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. వేదాళం.. వివేకం.. విశ్వాసం వంటి మాస్ సినిమాలతో శివకు అజిత్ ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే శివ త్వరలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రచారం అవుతోంది. శివ ఇప్పటికే రజనీకి కథ వినిపించాడని అయితే ఫైనల్ కావాల్సి ఉందని ప్రచారమైంది. అయితే అధికారిక కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు.

తాజాగా దానిపై స్పష్టత వచ్చేసింది. రజనీ తదుపరి సినిమాని నిర్మించేందుకు సిద్ధమవుతున్నసన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటన ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీతో ఎంథిరన్- పేట లాంటి బ్లాక్ బస్టర్లను రూపొందించాం. తిరిగి సన్ పిక్చర్స్ రజనీతో మరో సినిమా చేస్తోంది.. తలైవార్ 168 మా బ్యానర్ సినిమా.. అంటూ ప్రకటన వెలువరించింది. డైరెక్టర్ శివ పేరును ప్రత్యేకించి మెన్షన్ చేశారు. మొత్తానికి తెలుగు కుర్రాడు అనుకున్నది సాధించాడు. అంత పెద్ద క్రేజీ ఆఫర్ అందుకుని తమిళ తంబీల మధ్య తట్టుకొని సత్తా చాటుతున్నాడు. శివ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా అతడు రజనీని కూడా మాస్ అవతారంలోనే చూపిస్తారనడంలో సందేహం లేదు. రజనీ ప్రస్తుతం మురుగదాస్ తో దర్బార్ సినిమాని కంప్లీట్ చేసి తర్వాత తన 168 సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నారు. నిజంగా ఈ జోరు ఈ స్పీడు, ఈ ధైర్యం యంగ్ హీరోలకు గనక ఉంటే ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడో ఉండేది. 


మరింత సమాచారం తెలుసుకోండి: