నాచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి ఫాం లో ఉన్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ జెర్సీ సినిమాతో హిట్ అందుకున్న నాని రీసెంట్ గా గ్యాంగ్ లీడర్ అంటూ వచ్చి అదరగొట్టాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో 'v' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.


ఆల్రెడీ మోహనకృష్ణ డైరక్షన్ లో నాని అష్టా చమ్మ, జెంటిల్ మన్ సినిమాలు చేశాడు. ఇప్పుడు రాబోతున్న సినిమా హ్యాట్రిక్ కాంబినేషన్ అవుతుంది. ఈ మూవీ తర్వాత నాని నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడ్డ నందిని రెడ్డి ఓ బేబీ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది.


ఇక ఇప్పుడు నాని సినిమా ఛాన్స్ కూడా అందుకుంది నందిని రెడ్డి. రీసెంట్ గా నందిని రెడ్డి నానికి ఓ కథ చెప్పడం జరిగిందట. నాని నందిని రెడ్డి కలిసి ఆల్రెడీ అలా మొదలైంది సినిమా చేశారు. ఇన్నాళ్లకు మళ్లీ వీరు కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పిన కథ కూడా నందిని రెడ్డి విజయ్ దేవర్కొండకు చెబితే అతను చేయనని చెప్పడం వల్ల నాని దగ్గరకు వచ్చింది.       


అయితే విజయ్ దేవరకొండకు రాసుకున్న కథను నానికి ఎలా సెట్ చేశారన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ బ్యానర్ లో నాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేశాడు. ఓ బేబీతో తన డైరక్షన్ టాలెంట్ చాటిన నందిని రెడ్డి నాని సినిమాతో కూడా హిట్టు కొట్టాలని చూస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: