జక్కన్న రాజమౌళి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో అంతగా ఫేమస్ అవడమే కాదు మన తెలుగు సినిమా కీర్తిని మరెవరు అందుకోలేనంత ఎత్తుకు తీసుకు వెళ్ళారు. బాహుబలి రికార్డ్స్ ని సాహో సైరా బద్దలు కొడతాయనుకుంటే అంత సులభం కాదని తెలిసిపోయింది. దాంతో అందరు తన రికార్డ్ బద్దలు కొట్టే దమ్ము తనకే ఉందని అందరు ఇన్‌డైరెక్ట్ గా ఆర్.ఆర్.ఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఇక 2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ అంటు ఇండస్ట్రీలో పేరు మార్మోగుతోంది. సాహో.. సైరా తర్వాత ఈ వరుసలో రాబోతున్న సినిమా ఇది. పైగా బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆ క్రేజ్ ని మాటల్లో చెప్పలేము. 

అయితే అలాంటి క్రేజీ మూవీపై ఇటీవల రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని.. ముందే ప్రకటించినట్టు ఇన్ టైమ్ లో రిలీజయ్యే అవకాశం లేదు.. అంటూ సందేహం వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. వాస్తవంగా జక్కన్న సినిమా కాస్త ఆలస్యం అవుతుండటం సహజమే. ఎందుకంటే ఒక్క షాట్ పర్ఫెక్ట్ గా రాకపోయినా మళ్ళీ రీ షూట్ చేసే రకం మన జక్కన్న.

అయితే ఇలాంటి రూమర్లను ఖండిస్తూ డీవీవీ సంస్థ కానీ.. రాజమౌళి కానీ ఎలాంటి ప్రకటనను చేయడంలేదు. కనీసం పండగల కన్న, బర్త్ డేల కన్న అన్ని రూమర్లకు చెక్ పెడుతూ సినిమాకి సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఇస్తారా అంటే తుస్సు మనిపించారు. ఈ దసరా సందర్భంగా రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ న్యూస్ వస్తుందేమోనని కానీ ఏదీ రాలేదు. అలాగే 10 అక్టోబర్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బర్త్ డే సందర్భంగా .. అభిమానులకు ఏదైనా సర్‌ప్రజ్ ఉంటుందనుకుంటే అప్పుడు కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. 

ఫస్ట్ లుక్ పోస్టర్లు కానీ.. టైటిల్ కాని రివీల్ చేస్తారనుకుంటే అస్సలు అలాంటి ఊసే కనిపించలేదు. బర్త్ డే సందర్భంగా కనీసం ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ వీడియోని ఏదైనా రిలీజ్ చేస్తారా? అని అందరు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రతిసారీ రాజమౌళి బర్త్ డే కి ఏదో ఒక మెరుపు లాంటి వార్త ఉండేది. అయితే ఈసారి మాత్రం అది లేకుండా పోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరి వీటి వెనక ఉన్న అసలు కారణాలేంటో తెలియాలంటే ఆర్.ఆర్.ఆర్ బృందం స్పందించాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: