టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మన దేశంతో పాటు విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో, ఆయన తదుపరి సినిమా అయిన ఈ మూవీ పై ఇంత భారీ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. 

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భ్రీంగా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డివివి దానయ్య తన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ సినిమా అధికారిక ప్రెస్ మీట్ తరువాత, ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి న్యూస్ కానీ, లేదా మరొక పోస్టర్ కానీ రిలీజ్ కాకపోవడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ కొంత నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న రాజమౌళి పుట్టినరోజు కావడంతో, కనీసం సినిమా నుండి ఏదైనా ఒక్క పోస్టర్ వస్తుందని భావించిన ప్రేక్షకులకు పూర్తి నిరాశే ఎదురైంది. ఇకపోతే ఈ సినిమా పూర్తి టైటిల్ రామ రౌద్ర రుషితం అని నిర్ణయించినట్లుగా రెండు రోజుల క్రితం వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. 

అలానే మధ్యలో ఆర్ఆర్ఆర్ షూటింగ్స్ కు కొంత బ్రేక్స్ పడడంతో, అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ కాదు అనే వదంతులు కూడా వ్యాప్తి చెందాయి. అయితే వీటన్నిటి పై ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందించకపోవడానికి ఒక కారణం ఉందట. తమ సినిమా యూనిట్, టైటిల్ విషయమై ఇప్పటికే కొంత ఆలోచన చేసిందని, అలానే ప్రేక్షకులు ఆశిస్తున్నట్లు ఈ సినిమా అధికారిక ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేయాలని కూడా యోచిస్తున్నట్లు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయమై తమ సినిమా యూనిట్ కి పూర్తిగా క్లారిటీ ఉండడంతో, ప్రచారం అవుతున్న పుకార్లను ఏ మాత్రం లక్ష్యపెట్టదల్చుకోలేదట. మరి ప్రేక్షకులు ఆశిస్తున్నట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: