యువరత్న నందమూరి బాలకృష్ణ ఇటీవల తన తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. అయితే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెంచిన ఆ సినిమాలు, చివరకు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయాయి. అయితే తదుపరి చేయబోయే సినిమాతో తన ఫ్యాన్స్ కు తప్పకుండా మంచి కిక్ ఇవ్వాలని భావించిన బాలయ్య, గత ఏడాది తనకు జైసింహా సినిమాతో మంచి విజయాన్ని అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలోనే మరొక సినిమా చేయడానికి పచ్చ జండా ఊపారు. 

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తుండగా, బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహన్ లు హీరోయిన్లు గా నటిస్తుండగా మరొక హీరోయిన్ భూమిక ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఒక బడా డాన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ తాలూకు ఫోటోలు రిలీజ్ అయి నందమూరి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. 

అయితే ఈ సినిమాకు మొదట రూలర్ అనే టైటిల్ పెడతారని అందరూ భావించడం, అలానే అదే టైటిల్ గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవడం జరిగింది. అయితే నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు జడ్జిమెంట్ అనే టైటిల్ ని పెట్టాలని నిర్ణయించిందట సినిమా యూనిట్. అంతేకాక మరికొద్ది రోజుల్లో ఈ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయనుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మాత్రం, ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: