ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా  మారిపోయాడు.

ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే దసార సందర్భంగా  విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్‌ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు ఒక పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు.

 

ఇప్పటికే ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు.ఎందుకంటే బోయపాటి తీసిన జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమాలో రూలర్ అన్న పాట ఉంది. ఆ పాట సూపర్ హిట్ కూడా అయ్యింది. అయితే అదే టైటిల్‌తో అప్పట్లో జూనియర్ కూడా సినిమా తీయాలనుకున్నాడట. అది కుదరలేదు.

దీంతో ఇప్పుడు అదే ‘రూలర్’ బాలయ్య సినిమాకు టైటిల్ పెట్టడం అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: