దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి ఎంతటి అత్యద్భుత విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. ఇక ఆ సినిమాల విజయాల తరువాత అంతటి భారీ స్థాయిలో రూపొంది, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మరియు సైరా నరసింహారెడ్డి సినిమాలు మాత్రం ప్రేక్షకుల అంచలనాలు అందుకోవడంలో చాలావరకు విఫలమయ్యాయి. ఇక ముందుగా రిలీజ్ అయిన ప్రభాస్ సాహో సినిమా, కేవలం భారీ గ్రాఫిక్స్ మరియు విజువల్స్ కి మాత్రమే పరిమితం కాగా, 

సైరా విషయంలో కూడా ఆల్మోస్ట్ అదే విధంగా జరిగింది. ఇక సాహో విషయంలో బయ్యర్లకు కొంత నష్టం వాటిల్లింది. అయితే అది ఎంతమేరకు అనే దానిపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. ఇక ఆ తరువాత రిలీజ్ అయిన సైరా కూడా ప్రస్తుతం నత్తనడకన మెల్లగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి కూడా చాలా పేలవడంగా ఉందని, రాబోయే రోజుల్లో ఈ సినిమా భారీగానే బయ్యర్లకు నష్టాలు మిగిల్చనున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ రెండు భారీ సినిమాల ఫలితాల గుణపాఠంతో ఇకపై టాలీవుడ్ లో భారీ సినిమాల రాక కొంతవరకు తగ్గవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా ఎంతో భారీ సినిమా కావడం, అలానే దానిపైనా ప్రేక్షకుల్లో మంచి నమ్మకాలు ఉండడంతో, అది ఎంతమేర విజయాన్ని అందుకుంటుంది అనే దానిపై టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోందట. అయితే దానికి రాజమౌళి దర్శకుడు కావడంతో, చాలావరకు సినిమా సేఫ్ అనే అంటున్నారు. ఏది ఏమైనా ఇకపై రాబోయే రోజుల్లో తెలుగు సినిమా తెరపై భారీ చిత్రాల రాక పై సాహో, సైరా సినిమాల ప్రభావం తప్పనిసరిగా కొంతవరకు ఉంటుందని మాత్రం చెప్పవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: