తమన్నా భాటియా అందమైన నటి, మిల్కీ బేబీ. ఆమె చార్మింగ్ ఎవరికీ రాదంటారు. డ్యాన్స్ చేసిందంటే అదిరిపోవాల్సిందే. ఏ హీరోకైనా పక్కన సెట్ అయ్యే అభినయం ఆమె సొంతం. అటువంటి తమ్మూకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా వచ్చు. వెండి తెర మీదనే కాదు, తెర వెనక కూడా భారీ స్టేట్మెంట్ తో తమన్నా షాకులు ఇస్తుంది. తమన్నా లేటెస్ట్ గా ఓ ఇంటర్వూలో చెప్పిన మాటలు వింటే నిజంగా షాక్ తినాల్సిందే. 


తమన్నా ఇపుడు  నో కిస్ అంటోంది. ఆన్ స్క్రీన్ మీద నో కిస్. ఇది నా విధానం అని కచ్చితంగా చెప్పేస్తోంది. నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ రూల్ ని బ్రేక్ చేయలేను అంటోంది. 13 ఏళ్ల వయసు నుంచి తాను నటిస్తున్నానని, ఇప్పటివరకూ ఆ రూల్ కి కట్టుబడి ఉన్నానని చెప్తోంది. ఇకపై కూడా అదే తన విధానం అంటోంది. ఆన్ స్క్రీన్ మీద లిప్ లాక్ అంటూ ఎంత డిమాండ్ చేసినా తాను నో చెబుతూనే ఉంటానని, అవసరం అయితే ఆ మూవీని వదులుకుంటానని కూడా అంటోంది.  తమన్నా గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు. ఆమె పెయిర్ గా హీరో సక్సెస్ అయ్యాడంటే ఆ రొమాంటిక్ ఫిగర్, ఆ ఫీలింగ్స్ అన్నీ తమన్నా నుంచి షేర్ కావడం వల్లనే.


అటువంటి తమన్నా లిప్ లాక్ కి ఓకే అందంటే ఇక చాలదా సినిమా హాళ్ళు ఒక్కసారిగా వూగిపోతాయి. కానీ తమన్నా మాత్రం నో అంటే నో అంటోంది. 29 ఏళ్ల వయసు ఉన్న తమన్నా పదహారేళ్ళుగా కాపాడుకుంటూ వచ్చిన ఈ రూల్ ని ఎవరు బ్రేక్ చేయిస్తారో చూడాలి. కానీ తమన్నా మాత్రం ఎంతటి గొప్ప వారు  వచ్చినా తాను అలాగే ఉంటాను అంటోంది. సో తమన్నాతో లిప్ లాక్ సీన్ చూడలేమా. చూపించే వారే లేరా. ఇది ఫ్యాన్స్ గోల మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: