యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు రెండేళ్ళు ఎంతో కష్టపడి చేసిన పాన్ ఇండియా 'సాహో'. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో సాహో మీద ఊహించనంతగా క్రేజ్ నెలకొంది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తు సాహో.. ప్రభాస్ తో పాటు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరచింది. అందుకే ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాతో పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాదాకృష్ణతో 'జాన్'(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడని తాజా సమాచారం. 'జాన్' సినిమా ఫస్ట్ లుక్ ను ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారని లేటెస్ట్ న్యూస్. 

పీరియాడిక్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇంకో రెండు మూడు షెడ్యూల్స్ లో టోటల్ షూటింగ్ పూర్తవుతుందట. ఇక ఈ సినిమాను 2020 సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం. అందుకే సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తున్నారట.
 
అయితే 'సాహో' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేసారు. ఆ స్టిల్ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టారని విమర్శలొచ్చాయి. అందుకే ఈసారి 'జాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్రోల్స్ చేయకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట చిత్ర బృందం. జాన్ పోస్టర్ లో కంప్లీట్ గా ఫ్రెష్ లుక్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్. ఇక ఇదే నెలలో మళ్ళీ 'జాన్' ఫస్ట్ లుక్ తో హంగామా మొదలు పెట్టబోతున్నాడని  ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. మరి ఈ ఫస్ట్ లుక్ తో యంగ్ రెబల్ స్టార్ ఎలాంటి అంచనాలు క్రియోట్ చేస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: