టాలీవుడ్ లో గడిచిన రెండు నెలలో రెండు భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేశారు. వాటిలో ఒకటి సాహో కాగా మరొకటి సైరా నరసింహారెడ్డి. ఆగస్టు 30న ప్రభాస్ నటించిన సాహో విడుదల కాగా, ఈనెల 2న మెగాస్టార్ నటించిన మరో భారీ బడ్జెట్ సినిమా సైరా విడుదలైంది. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపు 600 కోట్లు కావడం విశేషం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇంత భారీ బడ్జెట్ సినిమాలు రావడం బహుషా ఇదే మొదటిసారి. దాంతో ఈ రెండు నెలలో మిగతా సినిమాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. అయితే ఇలా స్టార్ హీరోల సందడి చూసిన టాలీవుడ్.. మరో రెండు నెలల వరకు చిన్న సినిమాలతో సరిపెట్టుకోవలసిందే. ఎందుకంటే డిసెంబర్ వరకు టాలీవుడ్ నుండి ఒక్క పెద్ద హీరో సినిమా విడుదల అయ్యో అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఈ అక్టోబర్ నెలతో పాటు రానున్న నవంబర్ నెలలో కూడా కేవలం చిన్న సినిమాలు మాత్రమే విడుదల అవుతున్నాయి. రాగాల 24 గంటల్లో, సాఫ్ట్ వేర్ సుధీర్, మీకు మాత్రమే చెప్తా, ఇద్దరిలోకం ఒకటే, రాహు, ఆవిరి, రాజు గారి గది 3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఇలా దాదాపు 10-12 సినిమాలు విడుదలకు క్యూలో ఉన్నాయి. రవితేజ నటించిన డిస్కో రాజా, బాలయ్య సినిమా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డేట్స్ ప్రకటించారు కాబట్టి అప్పటివరకు బాక్సాపీస్ దగ్గర చిన్న సినిమాలు మాత్రమే సందడి చేయనున్నాయి. ఇక బాలయ్య సినిమా విడుదలైన కొద్దిరోజులకే మహేష్, బన్నీ, కళ్యాణ్ రామ్ 2020 సంక్రాంతి సినిమాలతో వచ్చేస్తారు. 

అయితే ఉన్న ఈ చిన్న సినిమాలలో మీకు మాత్రమే చెప్తా, ఇద్దరిలోకం ఒకటే కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు. ఎందుకంటే వీటిలో మీకు మాత్రమే చెప్తా కి విజయ్ దేవరకొండ నిర్మాత కాగా ఇద్దరిలోకం ఒకటే సినిమాకి, ఆవిరి సినిమాలకి దిల్ రాజు నిర్మాత. ఇక మిగతా సినిమాలన్ని అంతంత మాత్రమే అని చెప్పాలి. మరి వీటిలో ఏ సినిమా హిట్ లిస్ట్ లో చేరుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: