ఒకప్పుడు విజయశాంతి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.  ఆమె చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ఒకవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఆమె సోలో హీరోయిన్ గా కూడా మెప్పించడం మొదలుపెట్టింది.  ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావించి కష్టపడి పనిచేసేది.  అందుకే ఆమె అప్పట్లో నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది. సోలో హీరోయిన్ గా చేసిన కర్తవ్యం, ప్రతిఘటన, భారతనారి వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  


ఇందులో ప్రతిఘటన సినిమా సమయంలో ఆమె చాలా బిజీగా ఉన్నది.  సినిమాలకు డేట్స్ కేటాయించేందుకు ఒక్క రోజుకు కూడా ఖాళీగా లేదట.  దీంతో చాలా ఇబ్బందులు పడింది.  దర్శకుడు టి కృష్ణ పలుమార్లు అడిగినా డేట్స్ ఖాళీ లేకపోవడంతో  కుదరదని చెప్పిందట.  విజయశాంతి చేయకపోతే సినిమా ఆపేయాలని అనుకున్నాడట.  ఆయనే స్వయంగా రంగంలోకి దిగి నిర్మాతలను ఒప్పింది కొన్ని డేట్స్ ఖాళీ దొరికేలా చూశారు.  


దీంతో విజయశాంతి ప్రతిఘటన సినిమా చేసేందుకు ఒకే చెప్పింది. ఈ సినిమా షూటింగ్ కు కేవలం ఒక్క నెల రోజుల్లోనే పూర్తి చేశారు.  ప్రతి విషయం ఖచ్చితంగా ముందుగానే రెడీ చేసుకోవడంతో సినిమా షూటింగ్ ఈజీ అయ్యింది.  ఇందులో ఆమె నటనకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.  ఇక ఇందులో విలన్ గా చరణ్ రాజ్ ను తీసుకున్నారు.  అప్పటికే చరణ్ రాజ్ కన్నడంలో స్టార్ హీరో.  పది సినిమాలకు పైగా నటించారు.  


టి కృష్ణ చరణ్ రాజ్ ను కలిసి ప్రతిఘటన సినిమాలో విలన్ రోల్ చేయాలనీ అడిగితె కుదరదని చెప్పాడట. కన్నడంలో అప్పటికే పది సినిమాలు హీరోగా చేశానని, విలన్ చేయడం ఏంటి అని అన్నారట.  కానీ, కథ చెప్పి ఆయన్ను ఒప్పించి.. సినిమా ఒకే చేయించారు. సినిమాలో తనను తీసేయాలని కోరుకుంటూనే షూటింగ్ కు హాజరయ్యారట చరణ్ రాజ్.  అనుకున్నది ఒకటి అక్కడ అయ్యింది మరొకటి.  చేసిన ప్రతి షాట్ ఒకే అయ్యింది.  సినిమా రిలీజ్ అయ్యాక చరణ్ రాజ్ పాత్రకు మంచి పేరు వచ్చింది.  ఆ తరువాత కన్నడంలో కంటే తెలుగులోనే అయన పాపులర్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: