అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 మరో మూడు వారాల్లో పూర్తి కాబోతుంది. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, మహేశ్ విట్టా ఉన్నారు. ఈ వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అవుతాడని రాహుల్, వరుణ్ సందేశ్ సేవ్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. 
 
సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తున్నా ఈ అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. గతంలో మహేశ్ విట్టా చాలాసార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యాడు. కానీ మహేశ్ విట్టా ఫ్యాన్స్ ప్రతిసారి మహేశ్ విట్టాను సేవ్ చేసుకుంటూ వచ్చారు. గత వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఊహించని విధంగా పునర్నవి ఎలిమినేట్ అయింది. 
 
మహేశ్ విట్టా ఫ్యాన్స్ మహేశ్ విట్టాను సేవ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా హౌస్ మేట్స్ ఫ్యాన్స్ కూడా కొందరు మహేశ్ విట్టాను సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. కానీ మహేశ్ పై ప్రేక్షకుల్లో కొంత నెగెటివిటీ ఉంది. బాబా భాస్కర్ కు సన్నిహితుడైన మహేశ్ విట్టా చాలా సందర్భాల్లో బాబా భాస్కర్ గురించి మిగతా ఇంటి సభ్యుల దగ్గర చెడుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 
 
ప్రేక్షకులు మాత్రం మహేశ్ విట్టా రెండు నాలుకల ధోరణిని భరించలేకపోతున్నామని మహేశ్ విట్టాను ఎలిమినేట్ చేస్తామని చెబుతున్నారు. మరి అందరూ ఊహిస్తున్నట్లు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మహేశ్ విట్టా ఎలిమినేట్ అవుతాడో లేదో చూడాలి. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని రాహుల్, మహేశ్ విట్టా ఎలిమినేట్ అవుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: