ఈ నెల 23న రాబోతున్న పుట్టినరోజుతో ప్రభాస్ 40వ సంవత్సరంలోకి అడుగేడుతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ బ్యాచలర్ గా ఇప్పటికే ఒక ట్యాగ్ ను తెచ్చుకున్న ప్రభాస్ ఈ సంవత్సరం తన పుట్టినరోజునాడు ఎదో ఒక కీలక ప్రకటన చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి ప్రభాస్ తన పుట్టినరోజుకు ముందు లండన్ లో జరగబోయే ఒక కార్యక్రమం కోసం ‘బాహుబలి’ టీమ్ తో లండన్ వెళ్ళుతున్నాడు.

అయితే తన పుట్టినరోజు లండన్ లో జరుపుకుంటాడా లేకుంటే ఇండియా తిరిగి వచ్చి ఇండియాలో జరుపుకుంటాడా అన్న విషయం పై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా తన పుట్టినరోజునాడు ఒక కీలక విషయాన్ని ప్రభాస్ తన అభిమానులకు షేర్ చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల పై ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో విపరీతమైన ఆతృత పెరిగిపోయింది. 

ప్రభాస్ నటించబోయే ఒక లేటెస్ట్ భారీ సినిమా గురించి ఒక కీలక ప్రకటన చేస్తాడు అని కొందరు అంటూ ఉంటే మరికొందరు ప్రభాస్ తన పెళ్ళి గురించి ఒక న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ మళ్ళీ ప్రభాస్ పెళ్ళి పై వార్తలు ఊపు అందుకున్నాయి. ఇలా ప్రభాస్ పెళ్ళి పై వార్తల హడావిడి మొదలైనప్పుడల్లా మీడియా వర్గాలు కృష్ణంరాజును అడగడం అప్పుడు ఆయన ఈ విషయాలు ప్రభాస్ ను అడగండి అంటూ అనడం గత కొన్ని సంవత్సరాలుగా షరామామూలుగానే కొనాసాగుతూనే ఉంది. 

ఇది ఇలా ఉంటే అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న త్రీడి రామాయణంలో రావణ పాత్రను ప్రభాస్ చేత నటింప చేసే విషయంలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ రావణుడుగా నటించదానికి ఒప్పుకుంటే 100 కోట్లు భారీ పారితోషికం ఇస్తామని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే ప్రభాస్ మరొక భారీ సినిమాలో నటించే సాహసం చేయలేక తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీనితో ప్రభాస్ లేటెస్ట్ సినిమాలకు సంబంధించి ఎదో ఒక కీలక ప్రకటన్ అతడి పుట్టినరోజున ఉండబోతోంది అంటూ వార్తలు ఊపందుకున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: