తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 నిన్న  82 ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని శుక్రవారం నాటి ఎపిసోడ్ తో 83వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. .  ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెగ వెరైటీ టాస్క్ లు, గేమ్స్ ఆడిస్తున్నారు.  పండుగ సందర్భంగా కింగ్ నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు.  ఒక్కొక్కరికీ ఒక్కో టాస్క్ ఇచ్చి వారిలోని టాలెంట్ బయట పెట్టాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ తాను ఎలా ఉంటాను అన్న ఊహాచిత్రాన్ని గీయమని ఇంటి సభ్యులకు ఇచ్చారు. అంతే ఎవరికి వారు బిగ్ బాస్ ఇలా ఉంటాడు..అలా ఉంటాడు అని చిత్ర విచిత్రాలుగా బొమ్మలు గీశారు.  ఇక వరుణ్ సందేశ్ అయితే ఏకంగా హిమాలయాలకు వెళ్లిన స్వామీజీ..త్రినేత్రం గల దేవుడు అని పోల్చారు. అంతకు ముందు  బిగ్ బాస్ పడుకుంటాడట. అతడిని డిస్టర్బ్ చేయకూడదట. ఒకవేళ డిస్టర్బ్ చేస్తే వాళ్లకి శిక్ష విధిస్తాడట. అంటే టాస్క్ పూర్తయ్యే వరకూ ఎవరూ మాట్లాడకుండా, అరవకుండా, నవ్వకుండా టాస్క్ పూర్తి చేయాలి.

బాబా భాస్కర్ తన శరీరంపై ఉన్న జుట్టుని వాక్స్ చేయాలి. మహేష్ విట్టా తలపై ప్లేట్ పెట్టుకుని కింద పడకుండా.. గోడ కుర్చీ వేయాలి. వితికా, రాహుల్ బెలూన్స్‌కి షేవింగ్ క్రీమ్ రాసి నీట్‌గా షేవ్ చేయాలి. శివజ్యోతికి అలీ కితకితలు పెట్టాలి.  బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ భాగంగా ఇంటి సభ్యులకు ఒప్పో సెల్ ఇచ్చి రాహుల్ పాటతో వీడియో రూపొందించాలని చెప్పారు. బాబా భాస్కర్ డైరెక్షన్ అండ్ కెమెరా వర్క్ తో వీడియో బాగానే వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: