బాలక్రిష్ణ రోజా ఈ కాంబినేషన్ 90 దశకంలో సూపర్ హిట్. ఇద్దరూ కలసి ఈడు సినిమాలు చేస్తే మెజారిటీ హిట్టే. బాలయ్య సైతం అప్పట్లో రోజాతో కాంబో రిపీట్ కావాలని తెగ కోరుకునేవారట. ఇక రోజా తరువాత కాలంలో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె మొదట టీడీపీ, తరువాత కాంగ్రెస్ ఇపుడు వైసీపీ. ఇలా బాలయ్య కంటే రోజా పొలిటికల్ గా సీనియర్ లీడర్.


మరి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి కీలకమైన నామినేటెడ్ పదవిలో ఉన్న రోజాను మళ్ళీ బాలయ్య సినిమాలో తీసుకోవాలని అనుకుంటున్నారుట. బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీలో లేడీ విలన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట. దానికి రోజా అయితే కరెక్ట్ అని అటు డైరెక్టర్ బోయపాటి, ఇటు హీరో బాలక్రిష్ణ కూడా ఫిక్స్ అయ్యారట.


రోజా పాత్ర సినిమా ఇంటర్వల్ అయినా తరువాత ఎంటరవుతుందట. ఇక సినిమా మొత్తం ఉండే ఈ పాత్ర రఫ్ఫాడించేలా బోయపాటి డిజైన్ చేశారట. బాలయ్య రోజా ఆఫ్ స్క్రీన్ లో మంచి మిత్రులు. రాజకీయ పార్టీలు వేరు అయినా ఒక్క మాట కూడా ఇద్దరూ ఒకరిని ఒకరు అనుకోరు. ఇక ఈ మూవీ పాలిటిక్స్ మీద కూడా ఉండడంతో నాచురల్ గానే హైప్ క్రియేట్ అవుతోంది. పైగా ఇద్దరు ఏపీలో ప్రధాన పార్టీలకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.


దాంతో రోజా బాలయ్యకు విలన్ అయితే సినిమా అదిరిపోతుందని సీన్లు కూడా పండుతాయని అనుకుంటున్నారుట. అయితే ఈ మూవీకి రోజా గ్రీన్ సిగ్నల్ ఇంకా ఇవ్వవ‌లసివుంది. రోజా కనుక ఓకే అంటే బాలయ్యకు ఎదురునిలిచి పవర్ ఫుల్ డైలాగులతో రెచ్చిపోయే లేడీ విలన్ గా వెండి తెర మీద కనిపించడం ఖాయమంటున్నారు. మొత్తానికి ఈ న్యూస్ బయటకు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: