ఒకప్పుడు సినిమా షూటింగ్ చేయాలంటే చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది.  అక్కడి స్టూడియోస్ లో మాత్రమే సినిమాలు చేసుకునే అవకాశం ఉండేది.  ఎప్పుడైతే హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేసారో... అప్పటి నుంచి తెలుగు సినిమాలు హైదరాబాద్ లోని ఫిలిం సిటీలో షూటింగ్ చేయడం మొదలుపెట్టారు. 


ఒక్క తెలుగు సినిమాలే కాదు, ఇతరభాషా చిత్రాలు కూడా రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో హాలీవుడ్ సినిమాలు సైతం షూటింగ్ జరుపుకోవడం విశేషం.  ఇదిలా ఉంటె, ప్రస్తుతం టాలీవుడ్ కు చెందిన యువ హీరోల సినిమాలు రామోజీఫిల్మ్ సిటీలో జరుపుకుంటున్నాయి.  కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎంత మంచి వాడవురా సినిమా షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతున్నది.  


ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు.  ఆ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు.  ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోంది.  ఇందులో మెహ్రీన్ హీరోయిన్.  ఈనెల 22 వ తేదీ వరకు అక్కడే షూటింగ్ చేయబోతున్నారు.  వచ్చే ఏడాది జనవరిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  వేగేశ్న సతీష్ దర్శకుడు.  ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ప్రతి రోజు పండుగే సినిమా షూటింగ్ కూడా అక్కడే జరిగుతున్నది.   వ్యవసాయ క్షేత్రం నేపథ్యంగా సాగుతూ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సన్నివేశాలను సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా తదితరులపై తెరకెక్కిస్తున్నారు.  


తాత మనవళ్ల అనుభందంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.  మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.  మనం నవ్వుతుంటే సరిపోదు.. మన పక్కవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనే థీమ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాతో పాటుగా కన్నడ సినిమా కేజేఎఫ్ 2 కూడా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్నది.  యాశ్ నటిస్తున్న ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు.  సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: