టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు..కానీ కొద్ది మంది మాత్రమే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చిన ముద్దుగుమ్మలు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని తర్వాత తమిళ, హిందీ భాషల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.  టాలీవుడ్ లో అదితిరావు హైదరి నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి పాపులారిటీ సంపాదించింది.  అస్సాంకు చెందిన మహ్మద్ సలేహ్ అక్బర్ హైదరి, హైదరాబాద్కు  చెందిన  జానంపల్లి రామేశ్వరరావుల కుటుంబంలో జన్మించింది.  వీరిద్దరిదీ రాజకుటుంబమే.

2006లో మమ్ముట్టి సరసన, మలయాళ మూవీ ప్రజాపతితో తెరంగేట్రం చేసింది అదితిరావు.  ఈ సినిమాలో దేవదాసీ పాత్రలో నటించిన ఆమెకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. దక్షిణాదితోపాటు అటు బాలీవుడ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పెళ్లిపై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.

పెళ్లికి రవివర్మ పెయింటింగ్‌లో అమ్మాయిలా తయారు కావాలని ఉందని అన్నారు.  నాకు క్లాసిక్‌గా ఉండటమే ఇష్టం. సముద్రం వద్ద ఉన్న అత్యంత పురాతన హవేలీలో వివాహం చేసుకోవాలని ఉంది. హవేలీలో పెళ్లి పనులు, హడావుడి పూర్తయిన తర్వాత నా చెప్పులు తీసేసి.. ఆనందంగా అలా సముద్రం వద్దకు పరిగెడతా.

ఆ రోజు మొత్తం చిందేస్తూ ఉంటా...ఆలోచనలు కొందరికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నాకు ఓ గదిలో బంధించినట్లు ఉండటం నచ్చదు. అలా ఉండటం నా వల్ల కాదు.అంటూ త‌న‌దైన శైలిలో న‌వ్వుతూ చెప్పారు  అదితిరావు హైదరి.  మొత్తానికి ఈ బాలీవుడ్ బ్యూటీ తన పెళ్లి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని అనుకుంటున్నారు అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: