శుక్రవారం బిగ్ బాస్ ఎపిసొడ్ చాలా ఫన్నీగా జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లతో కంటెస్టెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు.అయితే ఈ ఎపిసోడ్ లో కొంతమంది చేష్టలు చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. ముఖ్యంగా ముగ్గురి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ముగ్గురిలో వితికా, వరుణ్ ,శ్రీముఖి ఉన్నారు. వితికా చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతుందని ఆమె అనుకుంటుంది. అయితే ఆ స్మార్ట్ గేమ్ పేరుతో అవతలి వారిని మోసం చేస్తుందన్న భావన కూడా ప్రేక్షకుల్లో ఉంది.


శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో అది మరోసారి రుజువైంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో బెలూన్ కి షేవ్ చేయమన్నప్పుడు ఆమె రివర్స్ లో చేసింది. పక్కనే ఉన్న రాహుల్ అలా కాదు అని చెప్పినా కూడా ఆమె పట్టించుకోకుండా చేసింది. దానివల్ల బిగ్ బాస్ పనిష్మెంట్ కి గురైంది. ఇక వరుణ్ చేసిన తప్పేంటంటే...వితికా తప్పు చేసిందని రాహుల్ అన్నప్పుడు ఆమె కన్నా ముందు వరుణ్ రియాక్ట్ అయ్యాడు. వితికాని ఎవ్వరేమన్నా ముందు వరుణే రియాక్ట్ అవుతున్నాడు.


ఆమె చేసింది తప్పైనా సరే. ఆమెకే సపోర్ట్ చేస్తాడు. వరుణ్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడన్న విషయం మర్చిపోయాడు. ఆమెని ఎవరూ ఏమీ అనకూడదంటే హౌస్ కే రాకూడదు. అందరిలాగే ఆమె కూడా ఒక కంటెస్టెంట్. అందరిఈ ప్రశించినట్టే ఆమెని కూడా ప్రశ్నిస్తారు. సమాధానం కూడా ఆమే చెప్పాలి. అంతే కానీ ప్రతీ దాంట్లో వరుణ్ కలగజేసుకుంటే ఆమె గేమ్ ఆడటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.


ఇక మూడోది శ్రీముఖి... బిగ్ బాస్ చూపించిన వీడియోల గురించి అందరు మర్చిపోయారు కానీ శ్రీముఖి ఇంకా మర్చిపోలేదు. ఆ విషయాన్ని బాబా భాస్కర్ తో చర్చిస్తూ తన గురించి ఏదో అన్నారని అది బాబా భాస్కర్ తనతో ఎందుకు చెప్పలేదు అంటూ వాదిస్తుంది. బాబా భాస్కర్ ఎందుకు చెప్పాలి అనే ఆలోచన ఆమెకు రాలేదు. ఈ విధంగా బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులు హైలైట్ గా నిలిచాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: